సెంట్రల్ జైలులో కరోనా కలకలం... ఆరుగురు ఖైదీలకు పాజిటివ్

By telugu news teamFirst Published Apr 22, 2020, 12:11 PM IST
Highlights

ఇండోర్ జైలులో కరోనా ప్రబలడంతో ముందుజాగ్రత్త చర్యలగా 250 మంది ఖైదీలను తాత్కాలికంగా ఇతర జైళ్లకు తరలించారు. జైలు అధికారులు, మిగతా ఖైదీలకు కరోనా నెగిటివ్ అని వచ్చిందని జైలు అధికారులు చెప్పారు. 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సెంట్రల్ జైలుకి కూడా పాకేసింది. ఇండోర్ సెంట్రల్ జైలులో ఆరుగురు ఖైదీలకు కరోనా వైరస్ సోకిందని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ లక్షణ్ సింగ్ బాదారియా చెప్పారు.

ఇటీవల చందన్ నగర్ లో పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో తండ్రికొడుకులైన ఇద్దరు నిందితులు అండర్ ట్రయల్ ఖైదీలుగా జైలుకు వచ్చారు. వారిద్దరితోపాటు వారి బారాక్ లో ఉన్న మరో ఖైదీకి కూడా కరోనా సోకింది. ఇండోర్ సెంట్రల్ జైలులో మొత్తం ఆరుగురు ఖైదీలకు కరోనా సోకడంతో వారందరినీ ఎంఆర్టీబీ ఆసుపత్రిలో క్వారంటైన్ కు తరలించారు. 

ఇండోర్ జైలులో కరోనా ప్రబలడంతో ముందుజాగ్రత్త చర్యలగా 250 మంది ఖైదీలను తాత్కాలికంగా ఇతర జైళ్లకు తరలించారు. జైలు అధికారులు, మిగతా ఖైదీలకు కరోనా నెగిటివ్ అని వచ్చిందని జైలు అధికారులు చెప్పారు. 

మరో 20 మంది ఖైదీలు, 29 మంది జైలు సిబ్బంది కరోనా పరీక్షలు చేయించామని, వారి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని జైలు అధికారులు వివరించారు. ఇండోర్ నగరంతోపాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1552 కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తంమీద ఇండోర్ సెంట్రల్ జైలులో కరోనా ఆరుగురు ఖైదీలకు సోకడంతో జైల్లో కలవరం రేగింది. 

click me!