Chinese drone: భారత్‌-బంగ్లా సరిహద్దులో చైనా డ్రోన్‌ కలకలం .. అప్ర‌మ‌త్తమైన బీఎస్ఎఫ్‌

Published : Mar 20, 2022, 04:35 AM IST
Chinese drone:  భారత్‌-బంగ్లా సరిహద్దులో చైనా డ్రోన్‌ కలకలం .. అప్ర‌మ‌త్తమైన బీఎస్ఎఫ్‌

సారాంశం

Chinese drone: భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో ఓ చైనా డ్రోన్‌ కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌లో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో ఓ చైనా డ్రోన్‌ కలకలం సృష్టించింది. పుర్బపారా గ్రామంలోని తన పొలంలో విరిగిపోయిన ఆ డ్రోన్‌ పడివుండటాన్ని పంకజ్‌ సర్కార్‌ అనే రైతు శనివారం గుర్తించాడని బీఎస్‌ఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు.   

Chinese drone: భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతంలో ఓ చైనా డ్రోన్‌ కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణా జిల్లాలోని  భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో చైనా తయారు చేసిన డ్రోన్ కనుగొనబడినట్లు సమాచారం. బోర్డర్‌ సెక్యూరిటీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పుర్బపారా గ్రామానికి చెందిన పంకజ్ సర్కార్ అనే రైతు త‌న‌ పొలంలో విరిగిన డ్రోన్ పడి ఉండటాన్ని చూశాడు. 
వెంట‌నే బీఎస్‌ఎఫ్‌ అధికారులకు స‌మాచారమిచ్చాడు. పుర్బపారా గ్రామం అంతర్జాతీయ సరిహద్దు నుండి 300 మీటర్ల దూరంలో ఉంది. సమాచారం అందుకున్న బోర్డర్‌ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే ఆ డ్రోన్‌ అక్కడ ఎలా పడిందనే దానిపై వివరాలు తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

మరోవైపు బీఎస్‌ఎఫ్‌కు చెందిన ప్రత్యేక బృందం డ్రోన్‌ను నిశితంగా పరిశీలిస్తోంది. అధికారుల ప్రకారం.. డ్రోన్ మోడల్ నంబర్ S500. ఇదిPRC (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) ద్వారా తయారు చేయబడింది. ప్రస్తుతం డ్రోన్‌ను క్లెయిమ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాగే.. ఈ డ్రోన్‌లో ఎలాంటి కెమెరాలు కనుగొనబడలేదు.

BSF వర్గాల సమాచారం ప్రకారం, కళ్యాణి గ్రామానికి చెందిన విపుల్ బక్షి, అతని కుమారుడు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో బంగాన్ వైపు నుండి మెరుస్తున్న కాంతితో ఏదో తెలియని వస్తువు ఎగురుతూ పొలంలో పడటం చూశారట‌. 
 
ఈ విష‌యాన్ని కేంద్రం చాలా సిరియ‌స్ గా తీసుకుంది. సరిహద్దు స్మగ్లింగ్‌కు కుట్ర పన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు BSF అధికారులు తెలిపారు. తదుపరి ఫోరెన్సిక్ విచారణ చేపట్టేందుకు డ్రోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు BSF పెట్రాపోల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించింది.

సరిహద్దుల్లో ప్రాంతాల్లోకి డ్రోన్లు చొరబడటం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో పంజాబ్, జమ్మూ సెక్టార్‌లో డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు చేరవేయడానికి ప్రయత్నాలు జ‌రిగాయి.  అలాగే, డ్రగ్స్ అక్రమ రవాణాకు కూడా పాక్ స్మగ్లర్లు డ్రోన్లను వినియోగిస్తున్నారు. పాక్ నుంచి వచ్చే డ్రోన్లను అడ్డుకునే యాంటీ-డ్రోన్ టెక్నాలజీని డీఆర్డీఓ, బీఎస్ఎఫ్ కలిసి పనిచేస్తున్నాయి.

మరోవైపు, జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్న నలుగురు మ‌ద్ద‌తుల‌ను అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆయుధాల తరలింపులో సహకరించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం జరిగిన గ్రెనేడ్ దాడిలో  దాడిలో మృతిచెందినవారి సంఖ్య రెండుకు చేరింది. ఈ ఘటనలో 23 మంది పౌరులు సహా ఓ పోలీసు గాయపడ్డారు. గాయపడిన ఓ పౌరుడు చికిత్స పొందుతూ ఆదివారమే మృతిచెందాడు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !