
Uttar Pradesh: సహనానికి మారు పేరుగా.. ఓర్పుకు ప్రతిరూపంగా నిలిచేవారు ఆడవారు.. అదే ఆడవారికి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. ఉగ్రరూపం దాల్చుతారు. వీరనారిమణుల్లా మారుతారు. తమ పట్ల చిన్న చూపు చేసే వారి పట్ల సివాంగుల్లా మారుతారు. అచ్చు అలాంటి ఘటననే యూపీలో జరిగింది. మద్యం మత్తులో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు పోలీస్. ఆమెను పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ.. నెట్టివేశాడు. దీంతో ఆమె సివంగిలా పోలీసుపై విరుచపడింది. అందరూ చూస్తుండగానే మద్యం మత్తులో ఉన్న పోలీసును తన చెప్పుతో చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసే.. మద్యం మత్తులో హల్ చల్ చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని చార్ బాగ్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళపై అనుచితంగా ప్రవర్తించాడు. లాఠీతో దారుణంగా కొట్టాడు. తరుచు కిందకు తోసివేశాడు. సహనం కోల్పోయిన సదరు మహిళ.. ఆమె ఎదురుదాడికి దిగింది. పోలీసులపై చెప్పుతో దాడికి చేసింది.
లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి హోంగార్డు ..మద్యం మత్తులో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ సందర్భంలో వారి పక్కనే ఉన్న మరో మహిళా పోలీస్ అధికారిని.. అతడితో వారిస్తున్న.. తాగిన మైకంలో సదరు కానిస్టేబుల్ అదేమీ పట్టించుకోకుండా.. మహిళాపై దాడి చేశాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి.. అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయినా ఏం మాత్రం తగ్గలేదుగా.. తనను అడ్డుకున్నడనే కోపంతో ఆ వ్యక్తిపై ఎదురుదాడికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో బాధిత మహిళ పోలీసుపై చెప్పుతో దాడి చేసింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఉన్న తనతో హోం గార్డు అసభ్యకరంగా మాట్లాడడనీ, అతన్ని ప్రశ్నించడంతో కర్రతో చేయి విరగ్గొట్టాడని ఆరోపించారు. ఆందోళనకు గురైన మహిళ నిరసన తెలపడంతో హోంగార్డు అసభ్యతకు పాల్పడ్డాడు. మధ్యలో వచ్చిన ఆ వ్యక్తిని చితకబాదాడు. ఈ తతంగాన్ని అంతా చూస్తు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున గుమ్మిగుడారు. ఇతర పోలీసులు వచ్చి అతడిని అడ్డుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ సదరు పోలీసుపై నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఈ సమయంలో అక్కడ గుంపులు గుంపులు గుంపులు గుంపులుగా ఉండడంతో ఆర్పీఎఫ్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ జోక్యం చేసుకుని శాంతించారు. దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని RPF అధికారులు తెలిపారు, అయితే ఒక ప్రయాణికుడు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో “క్రైమ్ ఇన్ ఇండియా” నివేదిక 2020 ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై పట్ల 9864 సంఘటనలు నమోదయ్యాయి. ఇందులో 3935 లైంగిక వేధింపుల సంఘటనలు, 1728 స్త్రీలపై దాడికేసులు 326 వేధింపుల కేసులు నమోదయ్యాయి.