చైనా వాదన ఆమోదయోగ్యం కాదు: గాల్వన్ లోయపై తేల్చేసిన ఇండియా

By narsimha lodeFirst Published Jun 18, 2020, 11:16 AM IST
Highlights

గాల్వమా లోయ తమదేనని చైనా చేస్తున్న వాదనలో ఆమోదయోగ్యం కానిదని, అతిశయోక్తి అని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.
 

న్యూఢిల్లీ: గాల్వన్ లోయ తమదేనని చైనా చేస్తున్న వాదనలో ఆమోదయోగ్యం కానిదని, అతిశయోక్తి అని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.

 చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై  భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం నాడు స్పందించారు.విదేశాంగ మంత్రి, స్టేట్ కౌన్సిలర్, చైనా విదేశాంగ మంత్రి లడఖ్ లో చోటు చేసుకొన్న పరిణామాలపై ఫోన్ లో చర్చలు జరిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

also read:గాల్వన్ లోయ మాదే, ఘర్షణలో మా తప్పు లేదు: చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు

జూన్ 6వ తేదీన సీనియర్ కమాండర్ల మధ్య వచ్చిన అవగాహనలను హృదయపూర్వకంగా అమలు చేయాలని రెండు పక్షాలు అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

అయితే దీనికి భిన్నంగా అతిశయోక్తి ఆమోదయోగ్యం కాని వాదనలు చేయడం రెండు పక్షాల మధ్య వచ్చిన అవగాహనకు విరుద్దమని ఆయన అభిప్రాయపడ్డారు.బుధవారం నాడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చైనా ప్రతినిధి వాంగ్‌యూతో ఫోన్లో మాట్లాడారు.

గాల్వన్ లోయలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయన చర్చించారు. ఈ ఘటన రెండు దేశాల దైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. ఈ ఘటనలో తమ దేశానికి చెందిన 20 మంది సైనికులు వీర మరణం పొందారన్నారు.

గాల్వన్ లోయలో పరిస్థితిని చర్చించేందుకు గాను ఈ నెల 19వ తేదీన అఖిపక్షం సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. చైనా సైనికులు చేసిన దాడిలో ఇండియాకు చెందిన సైన్యం మరణించిన ఘటనపై ఆయన అఖిలపక్షానికి వివరించనున్నారు.


 

click me!