China pakistan: చైనా కుతంత్రం.. పాకిస్థాన్‌కు 50 శాతం డిస్కౌంట్‌తో యుద్ధ విమానాలు

Published : May 21, 2025, 05:39 PM ISTUpdated : May 21, 2025, 05:40 PM IST
China Pakistan

సారాంశం

అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చైనా.. పాకిస్థాన్‌పై త‌న‌కున్న విధేయ‌త‌ను చాటుతూనే ఉంది. ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు చైనా త‌న మ‌ద్ధ‌తును బహిరంగంగానే చాటుతోంది. 

ఇండియా - పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన ఉద్రిక్తతల తర్వాత చైనా పాకిస్తాన్‌కు త‌న పూర్తి స‌హ‌కారాన్ని అందించే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే జే-35ఏ (J-35A) స్టెల్త్ యుద్ధ విమానాల డెలివరీని వేగంగా పూర్తిచేస్తోంది. పాకిస్థాన్‌కు ఇది ఒక రివార్డులా ఇస్తున్న‌ట్లు బీజింగ్, ఇస్లామాబాద్‌లో ఉన్న టాప్ డిప్లొమాటిక్ వర్గాలు పేర్కొన్నాయి.

చైనా తయారుచేసిన ఈ ఐదో తరం స్టెల్త్ యుద్ధవిమానాలు 2025 ఆగస్ట్‌లో పాకిస్తాన్‌కు చేరనున్నాయి. మొదటి విడతలోనే 30 జే-35ఏ విమానాలు ఇస్తున్నారు. ఇది రెండు దేశాల మల్టీ లెవెల్ డిఫెన్స్ భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

50 శాతం తగ్గింపు, సులభమైన చెల్లింపు విధానం:

అయితే ఈ కొనుగోలు విష‌యంలో కూడా పాకిస్థాన్‌కు పూర్తి స్థాయిలో మ‌ద్ధ‌తు అందిస్తోంది. ఈ విమానాలపై చైనా 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా, తక్కువ వడ్డీతో లేదా సులభమైన చెల్లింపు అవకాశాలను కూడా కల్పిస్తోంది. పాకిస్తాన్ వైమానిక దళం భార‌త్‌పై దిగిన ప్ర‌తీకార దాడికి ఈ డీల్ రివార్డుగా భావిస్తున్నారు.

2024 చివర్లోనే పాకిస్తాన్ ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. మొత్తం 40 J-35A స్టెల్త్ ఫైటర్‌లు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. చైనా తయారుచేసిన ఈ తరహా యుద్ధవిమానాలను తొలిసారి ఎగుమ‌తి చేస్తోంది.

చైనాలో శిక్ష‌ణ‌:

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) కు చెందిన పైలట్లు ఇప్ప‌టికే బీజింగ్‌లోని చైనా వైమానిక దళం ప్రధాన కార్యాలయంలో శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ ద్వారా పీఏఎఫ్ త్వరలో ఐదో తరం ఎయిర్ పవర్ సామర్థ్యాన్ని సంపాదించనుంది.

ఇదిలా ఉంటే ఈ విమానాల ఒప్పందంతో పాటు, చైనా రూ. 25 బిలియన్ డాలర్లను పాకిస్తాన్‌లోని మిలిటరీ, సివిల్ మౌలికసదుపాయాల్లో పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి CPEC (చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్) ఫేస్-2లో భాగంగా జ‌ర‌గ‌నుంది.

అంతే కాకుండా ఈ భాగస్వామ్యంలో భాగంగా గ్వాదర్ పోర్ట్ నిర్వహణకు పాకిస్తాన్ భద్రతను మరింత బలోపేతం చేస్తోంది. ఇది చైనా పెట్టుబడులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో తీసుకున్న కీలక నిర్ణయంగా తెలుస్తోంది.

చైనా - పాకిస్తాన్ మధ్య బలపడుతున్న రక్షణ, ఆర్థిక సంబంధాలు, భారత ఉపఖండంలో భ‌ద్ర‌త‌కు సంబంధించి తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu