నేలబావిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలు.. వారంతా అన్నదమ్ములు

sivanagaprasad kodati |  
Published : Oct 10, 2018, 02:51 PM IST
నేలబావిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలు.. వారంతా అన్నదమ్ములు

సారాంశం

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. సెంధ్వా పట్టణానికి సమీపంలోని చికలీలోని నేలబావిలో ఐదుగురు చిన్నారుల మృదేహాలు తేలుతూ కనిపించాయి

మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. సెంధ్వా పట్టణానికి సమీపంలోని చికలీలోని నేలబావిలో ఐదుగురు చిన్నారుల మృదేహాలు తేలుతూ కనిపించాయి. దీంతో గ్రామంలో కలకలం రేగింది. వారంతా ఒకే తండ్రి సంతానమని.. అన్నదమ్ములని గ్రామస్తులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా చంపారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ ఐదుగురు చిన్నారుల తండ్రి మహారాష్ట్రలో పనిచేస్తున్నాడు.. అతనికి ఇద్దరు భార్యలు.. మొదటి భార్యకు నలుగురు కొడుకులు కాగా.. రెండవ భార్యకు ఒక కొడుకు ఉన్నాడు.. అతని మొదటి భార్య పుట్టింట్లో ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. దీంతో పోలీసులు ముగ్గురిని విచారిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం