ఇదయం ట్రస్ట్ నిర్వాహకుడుు శివకుమార్ సహా ఏడుగురు అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 2, 2021, 2:11 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇదయం ట్రస్ట్  నిర్వహిస్తున్న ఆశ్రమం నుండి పిల్లలు అదృశ్యమైన ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఇదయం ట్రస్ట్  నిర్వహిస్తున్న ఆశ్రమం నుండి పిల్లలు అదృశ్యమైన ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఆశ్రమం ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదయం ట్రస్ట్ నిర్వాహకుడు శివకుమార్ సహా పిల్లలను కొనుగోలు చేసిన వారిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు 

ట్రస్ట్ కోఆర్డినేటర్ ఆర్ కలైవానీ, మధ్యవర్తులు సెల్వీ, రాజా, పిల్లలను దత్తత తీసుకొన్న జంటలు ఎం సాహుబర్ సాధిక్, అతని భార్య అనిశ్రానీ, జి. కన్నన్, ఆయన భార్య భవానీలను పోలీసులు అరెస్టు చేశారు. ఆశ్రమ నిర్వాహకుడు శివకుమార్ ను శుక్రవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు పోలీసులు.

also read:తమిళనాడులో దారుణం: ఆశ్రమంలో ఉన్న చిన్నారి విక్రయం, మరో 16 మంది అదృశ్యం

ఈ ఆశ్రమంలోని చిన్నారి కరోనా కారణంగా మృతి చెందితే థాథనేరి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారని సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో పోలీసులు కీలక అంశాలు తెలుసుకొన్నారు.పిల్లలను దత్తత తీసుకొనే పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్  జరుగుతుందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ ట్రస్టు నిర్వహిస్తున్న  ఆశ్రమాన్ని పోలీసులు సీజ్ చేశారు.  ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు.

click me!