ఏనుగుల గుంపును తరమబోతే.. గురి తప్పిన తూటా, తల్లి ఒడిలోని రెండేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది..

By SumaBala BukkaFirst Published Dec 11, 2021, 11:54 AM IST
Highlights

ఏనుగులను బెదిరించేందుకని గురువారం రాత్రి వారు తుపాకులతో కాల్పులు జరిపారు. అయితే, ఓ  తూటా ప్రమాదవశాత్తూ.. అక్కడికి సమీపంలోని ఓ ఇంటి ముందు అమ్మ ఒడిలో కూర్చున్న బిడ్డ శరీరంలోకి బలంగా దూసుకెళ్లింది. ఆమె తల్లిని కూడా ఆ తూటా గాయపరిచింది.

బోకో : herd of elephantsను తరిమేందుకు అటవీ సిబ్బంది జరిపిన Firingకు .. అమ్మ ఒడిలో సేదతీరుతున్న రెండేళ్ల చిన్నారి శాశ్వతంగా ఒరిగిపోయింది. Assamలోని కామరూప్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోకోలోని బోండపారా ప్రాంతానికి ఇటీవల ఏనుగులు గుంపుగా వచ్చాయి. వాటిని తరిమేందుకు Forest staff కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. 

ఏనుగులను బెదిరించేందుకని గురువారం రాత్రి వారు తుపాకులతో కాల్పులు జరిపారు. అయితే, ఓ  తూటా ప్రమాదవశాత్తూ.. అక్కడికి సమీపంలోని ఓ ఇంటి ముందు అమ్మ ఒడిలో కూర్చున్న బిడ్డ శరీరంలోకి బలంగా దూసుకెళ్లింది. ఆమె తల్లిని కూడా ఆ తూటా గాయపరిచింది.

గార్డులు వెంటనే వారిద్దరినీ బోకోలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ, అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన తల్లిని గువాహటి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

దారుణం : పొలానికి వెళ్లిన మహిళను తొక్కి చంపిన ఏనుగులు...!

ఇదిలా ఉండగా, గత మేలో అసోంలోని అటవీ ప్రాంతంలో ఘోరం జరిగిపోయింది. అడవిలో ఉన్న 18 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. ఈ ఘటనమీద chief minister తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ చేయాలని అటవీ శాఖ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. 

కొండమీద, కొండ దిగువన గజరాజుల dead bodyలు పడి ఉన్నాయి. ఈ ఘటన మీద సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణకు ఆదేశించారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అడవిలో పర్యటిస్తున్నారు. అసోం నాగావ్ జిల్లాలోని బాముని హిల్స్ వద్ద కాతియోటోలి పరిధిలోని కండోలి ప్రతిపాదిత రిజర్వ్డ్ ఫారెస్ట్ (పీఆర్ఎఫ్) లో గురువారం 18 అడవి ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఒక ప్రమాదంలో గజరాజులు మృతి చెంది ఉంటాయని అటవీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏనుగుల మృతి వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్పందించిన పోలీసులు వెతికే పనిలో పడ్డారు. ఏనుగులు మరణించడానికి కారణమేంటి? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. 

షాకింగ్ : అసోం అడవుల్లో 18 ఏనుగులు అనుమానాస్పద మృతి.. !!

ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) అమిత్ సహే మాట్లాడుతూ.. ఇది చాలా మారుమూల ప్రాంతం. వాటి కళేబరాలను రెండు గ్రూపులుగా పడి ఉన్నట్లు కనుగొన్నాం. 14 కొండమీద, మరో నాలుగు ఏనుగులు బయట పడి ఉన్నాయి. 

ఈ సంఘటనతో తాను తీవ్రంగా బాధపడుతున్నానని అసోం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పరిమల్ సుక్లబైద్యా అన్నారు. ఈ ఘటనమీద స్పందించిన ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్వ ‘ఆ ప్రదేశాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆదేశించారు. 
 

click me!