Sulur chopper crash... భారీ శబ్దంతో కూలింది: హెలికాప్టర్ ప్రమాదాన్ని రికార్డు చేసిన వీడియోగ్రాఫర్

Published : Dec 11, 2021, 11:34 AM ISTUpdated : Dec 11, 2021, 11:35 AM IST
Sulur chopper crash... భారీ శబ్దంతో కూలింది: హెలికాప్టర్ ప్రమాదాన్ని రికార్డు చేసిన వీడియోగ్రాఫర్

సారాంశం

తన కూతురి ఫోటోలను షూట్ చేస్తున్న సమయంలో హెలికాప్టర్ భారీ శబ్దంతో కుప్పకూలిందని వీడియో గ్రాఫర్ నాజర్ తెలిపారు. ఈ శబ్దం విని హెలికాప్టర్ కుప్పకూలిందని అనుమానంతో తాము అక్కడికి వెళ్లామని నాజర్ తెలిపారు. హెలికాప్టర్ కూలడానికి ముందు 19 సెకన్ల వీడియోను రికార్డు చేశామన్నారు.

న్యూఢిల్లీ: ఒక్కసారిగా చెట్టును ఢీకొని Sulur chopper crash జరిగిందని ఈ ఘటనను చిత్రీకరించిన వీడియో గ్రాఫర్ నాజర్ దర్యాప్తు అధికారులకు తెలిపారు.  నాజర్ తో పాటు ఆయన సహాయకుడు జోయ్‌లను కూడా దర్యాప్తు అధికారులు  ఇప్పటికే ప్రశ్నించారు. అయితే మరింత సమాచారం కోసం దర్యాప్తు అధికారులు వీరిద్దరిని మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది.ఈ నెల 8వ తేదీన నీలగిరి కొండల్లో చెట్లనుఢీకొని హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్ కుప్పకూలిన సమయంలో  19 సెకన్ల వీడియోను  తాను రికార్డు చేసినట్టుగా video grapher నాజర్ చెప్పారు. శుక్రవారం నాడు వీడియో గ్రాఫర్ నాజర్, అతని సహాయకుడు జోయ్ ను తమిళనాడు పోలీసులు ఐదు గంటల పాటు ప్రశ్నించారు.  

ఈ నెల 8వ తేదీన  తన కుటుంబంతో కలిసి ఊటీకి బయలుదేరినట్టుగా వీడియోగ్రాఫర్ Nazar తెలిపారు.  మెట్టుపాలెం మీదుగా ఊటీకి వెళ్లే సమయంలో కాటేరీ పార్క్ వద్ద రైల్వే ట్రాక్ పై ఫోట్ షూట్ చేస్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని నాజర్ తెలిపారు. తన కూతురికి సంబంధించి ఫోటో షూట్ చేస్తున్న సమయంలో హెలికాప్టర్ చెట్లను ఢీకొంటూ కుప్పకూలిందని నాజర్ ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

also read:Sulur chopper crash: సాయితేజ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన వైఎస్ జగన్

దట్టమైన పొగమంచు కారణంగా హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసకొందని వీడియో గ్రాఫర్ అభిప్రాయపడ్డారు. భారీ శబ్దం చేస్తూ హెలికాప్టర్ కుప్పకూలడంతో  మూడు కిలోమీటర్లు నడుచుకొంటూ ప్రమాదస్థలానికి చేరుకొన్నామని నాజర్ చెప్పారు. అప్పటికే హెలికాప్టర్ మంటల్లో పలువురు చిక్కుకొని మరణించారని ఆయన చెప్పారు. వెంటనే ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం అందించినట్టుగా నాజర్ వివరించారు.

ఈ సమాచారం ఆధారంగా పోలీసలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టినట్టుగా వీడియోగ్రాఫర్ చెప్పారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి ముందు తాను తీసిన వీడియోను స్థానిక పోలీసులకు అందించినట్టుగా ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.  ఇదే వీడియోను ఆర్మీ అధికారులు కూడా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన స్థలం నుండి హెలికాప్టర్ శకలాలను  తరలించడానికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.  

ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 12:4 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు నాజర్ బృందం తెలిపింది.  అదే రోజున ఉదయం 11:48 గంటలకు సూలూరు ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన హెలికాప్టర్ వెల్లింగ్టన్ ఎయిర్ బేస్ కు చేరాల్సి ఉంది. అయితే మార్గమధ్యలోనే హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ సహా 13 మంది మరణించారు. ఈ ప్రమాదంలో కెప్టన్ వరుణ్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు.ఈ ప్రమాదంపై  దర్యాప్తు చేపే నిపుణుల బృందం ముంబై నుండి నీలగిరికి ఇవాళ బయలుదేరింది. ప్రమాదం జరగానికి గల కారణాలను ఈ బృందం విశ్లేషించనుంది. 

PREV
click me!

Recommended Stories

మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu
Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు