కారణమిదే: కేంద్ర ఆర్ధిక ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా

First Published Jun 20, 2018, 4:53 PM IST
Highlights

ప్రధాని ఆర్ధిక సలహాదారు రాజీనామా


న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్  బుధవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ  ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో అరవింద్ సుబ్రమణియన్ ప్రకటించారు.

వ్యక్తిగత  కారణాలతో తన పదవికి అరవింద్ సుబ్రమణియన్ రాజీనామా చేశారని సమాచారం. కొన్ని రోజుల క్రితం  ఆయన తనతో వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారని అరుణ్ జైట్లీ ప్రకటించారు. అమెరికా వెళ్ళిపోవాలని అరవింద్ సుబ్రమణియన్ భావిస్తున్నారని తనకు చెప్పారని అరుణ్‌జైట్లీ తన పోస్టులో ప్రకటించారు.

కుటుంబ కారణాల రీత్యానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకు అంగీకరించడం తప్ప వేరే మార్గం తమకు కనిపించలేదని జైట్లీ తెలిపారు. కాగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా 2014 అక్టోబరు 16న మూడేళ్ల కాలానికి అరవింద్ సుబ్రమణియన్ ని నియమించారు. 

గత ఏడాది ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే, అరుణ్ జైట్లీ ఆయనను మరికొంత కాలం ఉండాల్సిందిగా కోరారు. దీంతో ఓ ఏడాది పాటు ఆయన పదవీకాలం పొడిగించారు. అరవింద్ సుబ్రమణియన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్, డీఫిల్ పూర్తి  చేశారు.

click me!