రోహిత్ తల్లిపై ఒత్తిడి.. డబ్బులిచ్చి తిట్టిస్తున్నారు..

First Published Jun 20, 2018, 4:51 PM IST
Highlights

రోహిత్ తల్లిపై ఒత్తిడి.. డబ్బులిచ్చి తిట్టిస్తున్నారు..

రోహిత్ వేముల తల్లి బీజేపీని విమర్శించడం వెనుక ఎవరో ఉన్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్. . దీనిపై పీయూష్ గోయెల్ స్పందించారు. ఆమె ఏం మాట్లాడారో మనం విన్నా.. ఆమె మాటల వింటుంటే రాధిక గారి వెనుక డబ్బులిచ్చి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను అన్నారు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేముల కుటుంబసభ్యులను స్టేజీ మీదకు తీసుకెళ్లి స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని తెలిసింది. ఇలా చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో... ఇందుకోసం వాళ్లు ఏం ఆఫర్ చేస్తున్నారో బయటపెట్టాలని.. నీచరాజకీయాలు చేస్తున్న రాహుల్ తక్షణం క్షమాపణలు చెప్పాలని పీయూష్ గోయెల్ డిమాండ్ చేశారు. 

అంతకు ముందు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటం తన ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందని రోహిత్ వేముల తల్లి రాధిక మీడియా ముందుకు వచ్చారు. తాను డబ్బులు తీసుకుని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానన్న వార్తల్లో నిజం లేదన్నారు.. అయితే ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ తనకు డబ్బులు సాయం చేస్తామని వాగ్ధానం చేసిన మాట నిజమేనని ఆమె అంగీకరించారు.

ఇల్లు కొనుక్కునేందుకు రూ 2.5 లక్షల చొప్పున రెండు చెక్కులు పంపించారని.. వాటిలో ఒకటి ఇంటి యజమానికి చెల్లించానని.. రెండోది బౌన్స్ అయ్యిందని.. విషయం వారికి తెలియడంతో ఆ చెక్కును తిరిగి పంపితే డబ్బులు పంపుతామని చెప్పినట్లు రాధిక తెలిపారు.. అంతకు మించి ఎవరూ తనను ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోలేదని.. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే డబ్బులు తీసుకోనక్కర్లేదని.. అవసరమైతే ముస్లిం యూనియన్ వాళ్లు మళ్లీ మీటింగ్ పెట్టినా ప్రధాని గురించి మాట్లాడతానన్నారు.. 

click me!