రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం.. చెట్టును ఢీకొట్టిన తర్వాత కారులో చెలరేగిన మంటలు

By Mahesh KFirst Published Jan 22, 2023, 7:17 PM IST
Highlights

ఛత్తీస్‌గడ్‌లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టిన కారులో మంటలు చెలరేగడంతో అందులోని ముగ్గురు సజీవ దహనం అయ్యారు. బిలాస్‌పూర్‌లో ఆదివారం రాత్రి 1.30 గంటల నుంచి 2 గంటల మధ్యలో చోటుచేసుకుంది.
 

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్‌లో దారుణం జరిగింది. ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఆ తర్వాత కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులోని ముగ్గురూ సజీవంగానే దహనం అయ్యారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.

రతన్‌పూర్ - కోటా రోడ్డు పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చపోరాలోని పెట్రోల్ పంప్ నుంచి 100 మీటర్ల దూరంలోని చెట్టు వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆదివారం రాత్రి 1.30 గంటల నుంచి 2 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు నాలుగో మనిషి కూడా అక్కడ ఉన్నట్టు తెలిసింది. ఆ నాలుగో వ్యక్తి ఎవరు అనేది గుర్తించడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

మృతులను సమీర్ అలియాస్ షానవాజ్, ఆశికా మన్హర్, అభిషేక్ కుర్రేలుగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆశికా మన్హర్ఆ కారును డ్రైవింగ్ చేసినట్టు భావిస్తున్నారు.

Also Read: మంచి రోడ్ల వల్లే ఎక్కువ ప్రమాదాలు.. బీజేపీ ఎమ్మెల్యే వింత వివరణ

రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టిన తర్వాత కారులో మంటలు చెలరేగాయని రతన్‌పూర్ కోటా సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీసులు ఆశిశ్ అరోరా తెలిపారు. బాధితులు కారులో నుంచి బయటకు రాలేకపోయారని, వారంతా సజీవంగానే దహనం అయ్యారని వివరించారు. మృతుల అస్థికరలు కారులోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారి ఐడెంటిటీని గుర్తించారు.

బిలాస్‌పూర్‌లోని టోర్వా ఏరియాకు చెందిన షానవాజ్ ఖాన్‌దే ఆ వాహనం అని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతున్నదని తెలిపారు.

click me!