చెన్నై మిథనాల్ విషాదం : 21మంది మృతి కేసులో ఫ్యాక్టరీ యజమానితో సహా 16మంది అరెస్ట్..

Published : May 18, 2023, 11:51 AM IST
చెన్నై మిథనాల్ విషాదం : 21మంది మృతి కేసులో ఫ్యాక్టరీ యజమానితో సహా 16మంది అరెస్ట్..

సారాంశం

తమిళనాడులో మిథనాల్ విషాదం 21మందిని బలిగొన్న ఘటనలో మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిమీద హత్యా నేరం మోపారు.

చెన్నై : మిథనాల్‌ను విక్రయించి 21 మంది ప్రాణాలను బలిగొన్న ఆరోపణలపై చెన్నైకి చెందిన ఫ్యాక్టరీ యజమానిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఫ్యాక్టరీ యజమానితో సహా, అతని నుండి మిథనాల్‌ను కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు, దానిని రవాణా చేయడంలో సహకరించిన వారితో సహా మొత్తంగా, 16 మందిని హత్యానేరం కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రాష్ట్రంలో కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపడం వల్ల ప్రజలు పారిశ్రామిక మిథనాల్‌ తాగే పరిస్థితి నెలకొందని రాష్ట్ర పోలీసు చీఫ్‌ డాక్టర్‌ శైలేంద్రబాబు అన్నారు. కల్తీ మద్యానికి చెక్ పెట్టడం వల్లనే ప్రజలు మిథనాల్‌ తాగడానికి మొగ్గుచూపుతున్నారని అన్నారు.

జయశక్తి ప్రైవేట్ లిమిటెడ్ యజమాని అయిన ఇళయనంబి ఇద్దరు వ్యక్తులకు 1,200 లీటర్ల మిథనాల్‌ను అక్రమంగా విక్రయించినట్లు పోలీసు చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా సమయంలో అతని ఫ్యాక్టరీ మూతపడడంతో.. ఈ మిథనాల్ అమ్ముడవ్వలేదు. అలా మిగిలిపోయిన మిథనాల్ ను అతను ఇద్దరు వ్యక్తులకు అమ్మగా.. వారు మరో ఇద్దరికి 8 లీటర్ల చొప్పున సరఫరా చేశారు.

జల్లికట్టుకు అనుకూలంగా తీర్పు.. తమిళనాడు చట్టాన్ని సమర్ధించిన సుప్రీం కోర్టు..

ఈ మిథనాల్ తాగి విల్లుపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో 21 మంది మృతి చెందారు. మరో 30 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 1,192 లీటర్ల మిథనాల్‌ను స్వాధీనం చేసుకున్నామని, దీంతో పెద్ద విషాదం తప్పిందని పోలీసు చీఫ్ పేర్కొన్నారు. ఇళయనంబి, 1,200 లీటర్లను రూ. 60,000కి విక్రయించారు.

ఈ ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో మిథనాల్‌ని ఉపయోగించే అన్ని ఫ్యాక్టరీలు, తయారీ యూనిట్లలో మిథనాల్ స్టాక్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన చట్ట అమలు సంస్థల వైఫల్యంగా పరిగణించారు. దీంతో విల్లుపురం పోలీసు సూపరింటెండెంట్, ఇద్దరు డిప్యూటీలతో సహా 10 మంది పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చెంగల్పట్టు ఉన్నత పోలీసులు అధికారి బదిలీ అయ్యారు.

పారిశ్రామిక మిథనాల్ విడిగా దొరకకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల సహాయాన్ని ప్రకటించారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీ ఈ అంశంపై అధికార డీఎంకే "అసమర్థత"గా అభివర్ణించాయి.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం