దారుణం.. క్వారంటైన్ లో తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం, వీడియో తీసి బ్లాక్ మెయిల్....!!

By AN TeluguFirst Published Nov 20, 2021, 10:06 AM IST
Highlights

పవిత్రమైన వృత్తిలో ఉన్న ఇద్దరు వైద్యులు అపవిత్ర చేష్టలకు పాల్పడ్డారు. సాటి మహిళా వైద్యురాళ్ల మీద అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. చివరికి విధుల నుంచి డిస్మిస్ అయ్యి కటకటాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. covid-19 సమయంలో చాలా మంది వైద్యులు స్టార్ హోటల్ లో 15 రోజుల Quarantine గడిపారు. 

తమిళనాడు : మహిళలు ఎంత ఎదిగినా, ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, అవమానాలు, అవహేళనలు ఎదుర్కుని చదువుల్లో, ఉద్యోగాల్లో, ఉన్నతపదవుల్లో రాణిస్తున్న అమ్మాయిలు అదే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తమతోపాటు కలిసి పనిచేసేవారే తమ మీద అఘాయిత్యాలకు పాల్పడడం, బ్లాక్ మెయిల్ చేయడంలాంటి అనాగరిక చర్యలకు బలి కావాల్సి వస్తోంది. అలాంటి ఘటనే ఇది.. 

పవిత్రమైన వృత్తిలో ఉన్న ఇద్దరు వైద్యులు అపవిత్ర చేష్టలకు పాల్పడ్డారు. సాటి మహిళా వైద్యురాళ్ల మీద అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. చివరికి విధుల నుంచి డిస్మిస్ అయ్యి కటకటాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. covid-19 సమయంలో చాలా మంది వైద్యులు స్టార్ హోటల్ లో 15 రోజుల Quarantine గడిపారు. 

గత AnnaDMK ప్రభుత్వ హయాంలో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటటీ ఆస్పత్రికి చెందిన ఇద్దరు lady doctors చెన్నై టీ నగర్ లోని ఒక స్టార్ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్నారు. అదే hotel లో క్వారంటైన్ లో ఉన్న వెట్రిసెల్వన్ (35), మోహన్ రాజ్ (28) అనే ఇద్దరు డాక్టర్లు.. ఆ మహిళా వైద్యురాళ్ల గదిలోకి ప్రవేశించారు. వారిని అరిస్తే చంపుతానని బెదిరించి.. వారిమీద rape attemptకి పాల్పడ్డారు. 

Blast on Railway Track: ధ‌న్‌బాద్‌లో రైల్వేట్రాక్‌పై బాంబు పేలుడు.. ప‌ట్టాలు త‌ప్పిన డీజిల్ ఇంజిన్‌..

అంతటితో ఆగలేదు. ఆ లైంగిక దాడిని వీడియో తీశారు. అది చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ పులమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఆ sexual harrassements ఆగకపోతుండడంతో.. చివరికి వారు తట్టుకోలేకపోయారు. ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకుని ప్రభుత్వాధికారులు షాక్ అయ్యారు. ఆ తరువాత దీనిమీద దర్యాప్తుకు ఆదేశించారు. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు చెన్నై నగర పోలీస్ కమీషనర్ శంకర్ జివాల్.. Chennai తేనాంపేట మహిళా పోలీసులతో విచారణ జరిపించారు. ప్రాథమికంగా నేరం నిర్థారణ కావడంతో వైద్యులు వెట్రిసెల్వన్, మోహన్ రాజ్ లను గురువారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇద్దరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా Department of Health and Welfare శుక్రవారం డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ కేసులో చివరికి ఆ మహిళా వైద్యురాళ్లకు న్యాయం జరిగింది. కానీ వారికి తగిలిన గాయం మానడానికి, దాని నుంచి కోలుకోవడానికి వారికి చాలా సమయమే పడుతుంది. ఇలాంటి దాడులు, వేధింపుల మీద ‘మీటూ’ లాంటి ఎన్ని ఉద్యమాలు వచ్చినా వీటిని మాత్రం ఆపలేకపోతున్నాయి. 

ఇదిలా ఉండగా.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ముగ్గురు అక్కాచెల్లెళ్లు రైలు కింద పడి బలవన్మరం పాలైన ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. అహిరోలి గ్రామానికి చెందిన రాజేంద్ర, ఆశాదేవి దంపతులకు గణేష్, ఆర్తీ (20), ప్రీతి (18), కాజల్ (15)తో పాటు మరో కూతురు ఉంది. వీరిది economically poor family. ఇటీవలే రాజేంద్ర మరణించాడు. దీంతో గణేష్ పనికి వెడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆశాదేవికి eye problem ఉండడంతో ఆమెకు సరిగ్గా కనిపించదు. దీంతో ఆమె ఇంటి వద్దే ఉంటోంది. వయసుకు వచ్చిన చెల్లెల్లను పనికి తీసుకెళ్లడం గణేష్ కు ఇష్టం లేదు. పనికి వచ్చి.. నీతోపాటు money సంపాదిస్తామని చెల్లెళ్లు కోరగా అతను ఒప్పుకోలేదు. తమ్ముడు ఒక్కడే కష్టపడడం చూసి ఆర్తీ, ప్రీతి, కాజల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 

click me!