Blast on Railway Track: ధ‌న్‌బాద్‌లో రైల్వేట్రాక్‌పై బాంబు పేలుడు.. ప‌ట్టాలు త‌ప్పిన డీజిల్ ఇంజిన్‌..

Published : Nov 20, 2021, 09:56 AM IST
Blast on Railway Track: ధ‌న్‌బాద్‌లో రైల్వేట్రాక్‌పై బాంబు పేలుడు.. ప‌ట్టాలు త‌ప్పిన డీజిల్ ఇంజిన్‌..

సారాంశం

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ (Dhanbad) డివిజన్‌లో శనివారం తెల్లవారుజున రైల్వే ట్రాక్‌పై పేలుడు (Blast on Railway Track) సంభవించింది. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించిన డీజిల్ లోకోమోటివ్ (Diesel Locomotive) పట్టాలు తప్పింది.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ (Dhanbad) డివిజన్‌లో శనివారం తెల్లవారుజున రైల్వే ట్రాక్‌పై పేలుడు (Blast on Railway Track) సంభవించింది. దీంతో పట్టాలు కొంత భాగం దెబ్బతిన్నాయి. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించిన డీజిల్ లోకోమోటివ్ (Diesel Locomotive) పట్టాలు తప్పింది. ధన్‌బాద్ డివిజన్‌లోని గర్వారోడ్, బర్కానా సెక్షన్ల మధ్య రైల్వే పట్టాలపై పేలుడు చోటుచేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. దీనిని అసాధారణ ఘటనగా రైల్వే శాఖ (Railways) పేర్కొంది. అయితే నక్సల్స్‌ ఈ పేలుడు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవతున్నాయి.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే సీనియర్ అధికారులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించనున్నారు. అంతేకాకుండా పేలుడు కారణంగా దెబ్బతిన్న రైలు పట్టాల పునరుద్దరణ పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్