మియామి ఎయిర్ పోర్టు పేల్చేస్తానంటూ బెదిరింపులు.. యువకుడి అరెస్ట్

By ramya neerukondaFirst Published Nov 3, 2018, 3:40 PM IST
Highlights

అమెరికాలోని మియామి ఎయిర్ పోర్టుని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ యువడిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్వాడ్ అరెస్టు చేసింది. 

అమెరికాలోని మియామి ఎయిర్ పోర్టుని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ యువడిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్వాడ్ అరెస్టు చేసింది. అంతేకాకుండా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యాంటీ టెర్రర్ స్వ్కాడ్ అధికారులు తెలిపారు.

కాగా.. అతను అసలు ఎయిర్ పోర్టుని పేల్చేస్తానని ఎందుకు బెదిరించాడో తెలుసుకొని పోలీసులు విస్తుపోయారు. యూపీకి చెందిన 18ఏళ్ల యువకుడు వెయ్యి అమెరికన్ డాలర్లు విలువచేసే బిట్ కాయిన్ కొనుగోలు చేశాడు. ఈ ప్రాసెసింగ్ లో ఈ యువకుడు మోసపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఇతను.. వెంటనే యూనైటెడ్ స్టేట్స్ లోని ఎఫ్బీఐకి ఫిర్యాదు చేశాడు.

అయితే.. అతని ఫిర్యాదుని ఎఫ్బీఐ సీరియస్ గా తీసుకోలేదు. పోగా.. అతనికి సరైన సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో.. కోపంతో రగిలిపోయిన యువకుడు మియామి ఎయిర్ పోర్టును పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘‘ఎకే47 తుపాకీ, సూసైడ్ బెల్ట్ పెట్టుకొని అక్కడికి వస్తాను.. అందరినీ చంపేస్తాను’’ అంటూ ఫోన్ కాల్స్ చేసి బెదిరించాడు.

పదేపదే మియామి ఎయిర్ పోర్టుకి ఫోన్ చేసి ఇదేవిధంగా బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో సమాచారం అందుకున్న యూపీ పోలీసులు అతనిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చుసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!