పంజాబ్ : సీఎం నియామకంలో ట్విస్ట్.. సుఖ్‌జిందర్‌‌కు బదులుగా చరణ్ జిత్‌సింగ్

By Siva KodatiFirst Published Sep 19, 2021, 6:02 PM IST
Highlights

ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా ఎంపికైనట్లు కథనాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కొద్దిగంటల్లోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. సీఎంగా చరణ్ జిత్ సింగ్ చన్నీని అధికారికంగా ప్రకటించారు కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ హరీశ్ రావత్

పంజాబ్ కొత్త సీఎం నియామకం విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యాహ్నం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా ఎంపికైనట్లు కథనాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కొద్దిగంటల్లోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. సీఎంగా చరణ్ జిత్ సింగ్ చన్నీని అధికారికంగా ప్రకటించారు కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ హరీశ్ రావత్. చమకూర్ సాహిబ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చరణ్ జిత్ సింగ్. రానున్న ఎన్నికల నేపథ్యంలో సామాజిక లెక్కలు వేసుకున్న కాంగ్రెస్ పెద్దలు.. ఎస్సీ వర్గానికి చెందిన చరణ్ జిత్‌ను సీఎంగా ఎంపిక చేశారు. 

click me!