చంద్రయాన్-3 : చంద్రుడిపై అద్భుతం.. విక్రమ్ ల్యాండర్ చుట్టూ ఎజెక్టా హాలో...

By SumaBala Bukka  |  First Published Oct 27, 2023, 12:53 PM IST

చంద్రయాన్-3 మిషన్ విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సమయంలో డీసెంట్ స్టేజ్ థ్రస్టర్‌ల చర్య ఫలితంగా చంద్రుడి మీద గణనీయమైన మొత్తంలో సర్ఫిషియల్ ఎపిరెగోలిత్ పదార్థం బయటకు వచ్చి, 'ఎజెక్టా హాలో' ఏర్పడింది.


ఇస్రో : చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని మీదున్న పదార్థంతో అద్భుతమైన 'ఎజెక్టా హాలో' రూపొందిందని ఇస్రో ఎక్స్ లో షేర్ చేసింది. ఎన్ఆర్ఎస్సీ/ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండింగ్ సైట్ చుట్టూ 108.4 m² విస్తీర్ణంలో దాదాపు 2.06 టన్నుల లూనార్ ఎపిరెగోలిత్ ఎజెక్ట్ చేయబడిందని, ఇది స్థానభ్రంశం చెంది ఎజక్టా హాలో కి దారి తీసిందని అంచనా వేస్తున్నారు.

చంద్రయాన్-3 మిషన్ విక్రమ్ ల్యాండర్ 23 ఆగస్టు 2023న చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర ల్యాండ్ అయింది. డీసెంట్ స్టేజ్ థ్రస్టర్‌ల చర్య  ఫలితంగా ల్యాండింగ్ సమయంలో, గణనీయమైన మొత్తంలో చంద్రుడి మీది సర్ఫిషియల్ ఎపిరెగోలిత్ పదార్థం బయటకు వచ్చింది. ఫలితంగా 'ఎజెక్టా హాలో' ఏర్పడింది. చంద్రయాన్-2  ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా (OHRC) నుండి ల్యాండింగ్-ముందు, లాండింగ్ తరువాతి హై-రిజల్యూషన్ పాంక్రోమాటిక్ చిత్రాలను సరిపోల్చి ఇది తేల్చామని ఇస్రో చెబుతోంది.

Latest Videos

undefined

ల్యాండింగ్ ఈవెంట్‌కు గంటల సమయం ముందు.. ఆ తర్వాత ఈ 'ఎజెక్టా హాలో'ని వర్గీకరించాం. ల్యాండర్ చుట్టూ ఉన్న క్రమరహిత ప్రకాశవంతమైన ప్యాచ్ ఇది. మ్యాప్ చేయబడిన, వర్గీకరించబడిన, పరస్పర సంబంధం లేని 'ఎజెక్టా హాలో' పిక్సెల్‌ల నుండి, విక్రమ్ ల్యాండర్  ల్యాండింగ్ సీక్వెన్స్ కారణంగా స్థానభ్రంశం చెందిన లూనార్ ఎపిరెగోలిత్ ఎజెక్టా ద్వారా సుమారుగా 108.4 మీ2 విస్తీర్ణం కవర్ చేయబడిందని అంచనా వేయబడింది. ఆ తరువాత ఎపిరికల్ రిలేషన్స్ ను బట్టి ల్యాండింగ్ ఈవెంట్ కారణంగా సుమారు 2.06 టన్నుల చంద్ర ఎపిరెగోలిత్ బయటకు తీసినట్లు  అంచనా వేస్తున్నాం.. అని ఇస్రో తెలిపింది. 


 

Chandrayaan-3 Results:
On August 23, 2023, as it descended, the Chandrayaan-3 Lander Module generated a spectacular 'ejecta halo' of lunar material.

Scientists from NRSC/ISRO estimate that about 2.06 tonnes of lunar epiregolith were ejected and displaced over an area of 108.4 m²…

— ISRO (@isro)
click me!