ఆన్‌లైన్‌ విధానం అవినీతి, బంధుప్రీతిని అంతం చేసింది: రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోడీ

Published : May 16, 2023, 12:46 PM ISTUpdated : May 16, 2023, 12:50 PM IST
ఆన్‌లైన్‌ విధానం అవినీతి, బంధుప్రీతిని అంతం చేసింది: రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోడీ

సారాంశం

New Delhi: రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో తీసుకువ‌చ్చిన మార్పులు అవినీతి, బంధుప్రీతిని అంతం చేశాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఆన్ లైన్ విధానం అవినీతి, నెపోటిజంను అంతం చేసింద‌ని రోజ్‌గార్ మేళాలో మాట్లాడుతూ ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. 2018-19 నుంచి 4.5 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు పొందారనీ, అధికారిక ఉపాధి పెరుగుతోందని ప్రధాని ఈపీఎఫ్ఓ నికర పేరోల్ గణాంకాలను ఉదహరించారు.  

PM Modi-Rozgar Mela: రిక్రూట్ మెంట్ వ్యవస్థలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల వల్ల అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం లేకుండా పోయిందనీ, రోజ్ గార్ మేళాలో 71 వేల మందికి అపాయింట్ మెంట్ లెటర్లు అందజేశామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి ఫలితాల ప్రకటన వరకు మొత్తం ప్రక్రియను ఆన్ లైన్ చేశామనీ, గత తొమ్మిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వివరించారు. ఆన్ లైన్ విధానం అవినీతి, నెపోటిజంను అంతం చేసింద‌ని రోజ్‌గార్ మేళాలో మాట్లాడుతూ ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. 2018-19 నుంచి 4.5 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు పొందారనీ, అధికారిక ఉపాధి పెరుగుతోందని ప్రధాని ఈపీఎఫ్ఓ నికర పేరోల్ గణాంకాలను ఉదహరించారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అవినీతి, బంధుప్రీతికి ఆస్కారం లేకుండా పోయిందని ప్రధాని మోడీ అన్నారు. వాల్ మార్ట్, ఆపిల్, ఫాక్స్ కాన్, సిస్కో సహా ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈవోల‌తో ఇటీవల తాను జరిపిన సమావేశాలను ప్రధాని ప్రస్తావిస్తూ దేశంలో పరిశ్రమలు, పెట్టుబడులపై అపూర్వమైన సానుకూలత ఉందని నొక్కి చెప్పారు. 2018-19 నుంచి 4.5 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు పొందారని, అధికారిక ఉపాధి పెరుగుతోందని ఈపీఎఫ్ఓ నికర పేరోల్ గణాంకాలను ప్రధాని ఉదహరించారు. ఎఫ్ డీఐలు, దేశ రికార్డు ఎగుమతులు భారత్ లోని ప్రతి మూలలోనూ ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయనీ, అభివృద్ధి చెందుతున్న రంగాలకు తమ ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇవ్వడంతో ఉద్యోగాల స్వభావం కూడా మారుతోందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో స్టార్టప్ రంగంలో విప్లవం వచ్చిందనీ, 2014కు ముందు కొన్ని వందల నుంచి దాదాపు లక్షకు పెరిగాయనీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కనీసం 10 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. గత ఏడాది కాలంలో అభివృద్ధి గణాంకాలను ఉటంకిస్తూ, గ్రామీణ రహదారుల పొడవు 4 లక్షల కిలోమీటర్ల నుండి 7.25 లక్షల కిలోమీటర్లకు పెరిగిందనీ, విమానాశ్రయాల సంఖ్య 74 నుండి దాదాపు 150 కి పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. పేదల కోసం ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద 4 కోట్లకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం కూడా చాలా ఉపాధి అవకాశాలను సృష్టించిందని ప్రధాని మోడీ అన్నారు. 2014లో 720గా ఉన్న యూనివర్సిటీల సంఖ్య ఇప్పుడు 1,100కు పెరిగిందని, గతంలో 400 మెడికల్ కాలేజీలు ఉండగా, ఇప్పుడు 700కు పెరిగాయని తెలిపారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?