
పెళ్లి అనేది జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్నాపకం. ఇది ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇక, తమ పెళ్లి ప్రపోజల్ కూడా చాలా భిన్నంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఓ వ్యక్తి కూడా తమ పెళ్లి ప్రపోజల్ భిన్నంగా ఉండాలి అనుకున్నాడు. దాని కోసం షాపింగ్ మాల్ ని ఎంచుకున్నాడు.
షాపింగ్ మాల్ లో అందరూ చూస్తుండగా, తాను ప్రేమిస్తున్న ప్రియురాలికి పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఈ వీడియో చాలా క్యూట్ గా ఉండటంతో, నెట్టింట వైరల్ గా మారింది. కాగా, నెటిజన్ల రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది. హౌ క్యూట్ ని కొందరు, డ్రీమీ గా ఉందని, సినిమాటిక్ గా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
ఈ క్లిప్‌ను ప్రియాంషి అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో, ఒక వ్యక్తి కొంతమంది స్నేహితులతో ఉన్న మహిళ వైపు నడుస్తూ కనిపించాడు. వాళ్లు వెళ్తుంటే, ఈ వ్యక్తి వెళ్లి వారి వెనక మోకాళ్ల పై కూర్చున్నాడు. చేతిలో ఉంగరంతో ఉన్నాడు. అతనిని చూసి, వారిలో ఉన్న ఓ అమ్మాయి వెంటనే అతనిని గుర్తుపట్టి నవ్వేసింది. వెంటనే ఆమెకు అతను ఉంగరం ఇచ్చాడు. ఆమె వెంటనే ఆ ఉంగరాన్ని అందుకుంది. అనంతరం ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో 9.4 మిలియన్ల వీక్షణలు, ఏడు లక్షలకు పైగా లైక్ లు రావడం విశేషం.
అతను నటించడం లేదని,నిజాయితీగా ప్రేమను తెలియజేశాడు అని కొందరు కామెంట్స్ చేయగా, అతని ప్రపోజల్ కి ఆ అమ్మాయి కంటే, ఆమె స్నేహితులే ఎక్కువ షాక్ అయ్యారు అని కొందరు కామెంట్ చేయడం విశేషం. ఇక, ఇలాంటి అబ్బాయి దొరకడం ఆమె అదృష్టం అని కొందరు కామెంట్ చేశారు.