ముంబైలో దారుణం.. భర్తను గ్రౌండింగ్ రాయితో కొట్టి చంపిన భార్య...

Published : Aug 26, 2023, 11:48 AM IST
ముంబైలో దారుణం.. భర్తను గ్రౌండింగ్ రాయితో కొట్టి చంపిన భార్య...

సారాంశం

మతిస్థిమితం సరిగాలేని ఓ మహిళ భర్తను గ్రైండింగ్ రాయితో కొట్టి చంపింది. ఈ దారుణం ముంబైలో వెలుగు చూసింది. 

ముంబై : ముంబైలో దారుణఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్తను గ్రైండింగ్ రాయితో కొట్టి హత్య చేసింది. ముంబై మీరారోడ్డులోని తమ ఇంట్లో 55 ఏళ్ల మహిళ గురువారం నాడు తన భర్తను గ్రైండింగ్ రాయితో కొట్టి చంపింది. నిందితురాలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శాంతి నగర్ సెక్టార్ 7లోని ఆనంద్ సరిత బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. 

బాధితుడు ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన రమేష్ గుప్తా (69). అతని భార్య రాజకుమారి. వీరిద్దరూ తమ 30 ఏళ్ల కుమారుడితో కలిసి ఉంటున్నారు. గురువారం సాయంత్రం వారి ఫ్లాట్ నుండి శబ్దాలు వస్తుండడంతో... సెక్యూరిటీ గార్డు, ఇరుగుపొరుగువారు అప్రమత్తం అయ్యారు. వారు ఫ్లాట్ కు చేరుకునేసరికి రమేష్‌ రక్తపు మడుగులో ఉన్నాడు. 

ఐవీఎఫ్ సెంటర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం.. ఎగ్ డొనేషన్ కోసం పిలిచి డాక్టర్ తో సహా...

పక్కనే రాజ్‌కుమారి నిలబడి ఉంది. దీంతో వెంటనే ఉద్యోగానికి వెళ్లిన దంపతుల కుమారుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. నయానగర్ పోలీసు అధికారులు ఫ్లాట్‌కు చేరుకుని రాజకుమారిని అదుపులోకి తీసుకున్నారు. రక్తంలో తడిసిన గ్రౌండింగ్ రాయిని స్వాధీనం చేసుకున్నారు. గొడవ పడి తన భర్తను గ్రౌండింగ్ రాయితో కొట్టినట్లు రాజకుమారి పోలీసులకు తెలిపింది. గొడవ వెనుక ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. 

రాజ్‌కుమారి అనే గృహిణి డిప్రెషన్‌లో ఉందని, వారంరోజుల క్రితం తాము వైద్యుడి వద్దకు వెళ్లామని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు.  రమేష్ కూడా అస్వస్థతతో ఉన్నాడు. రాజ్‌కుమారి సూచించిన మందులు ఏమైనా తీసుకున్నారా అనే విషయాన్ని నిర్ధారిస్తున్నామని పోలీసులు తెలిపారు. భవనంలో దంపతులు ఎలాంటి ఇబ్బందులు సృష్టించలేదని నివాసితులు తెలిపారు.

ఉదయం తాను ఆఫీసుకు వెడుతున్న సమయంలో ఇంట్లో పరిస్థితి అంతా మామూలుగానే ఉందని కొడుకు పోలీసులకు చెప్పాడు. సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి వచ్చిన అతను రక్తపు మడుగులో ఉన్న తన తండ్రిని చూశాడు. కొడుకుని చూసి అతని తల్లి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజకుమారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్