
Chandrayaan 3: భారతదేశం చంద్రుడిని జయించింది. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) పంపించిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా భారతదేశం. ఇస్రో శాస్త్రవేత్తలకు దేశం,ప్రపంచం నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ కె.శివన్ కూడా చంద్రయాన్-3 విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.
శివన్ ఏమన్నారంటే?
చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల ఇస్రో మాజీ చైర్మన్ కె.శివన్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. ఈ విజయంపై యావత్ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సహకరించినందుకు అభినందనలు తెలిపారు. ఇది ఒక్క ఇస్రో విజయం మాత్రమే కాదని, యావత్ దేశం సాధించిన విజయమని అన్నారు. చంద్రయాన్-3 యొక్క సైన్స్ డేటా భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ శాస్త్రవేత్తలకు అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఉపయోగపడుతుందని కె శివన్ అన్నారు. ఈ డేటాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఉపయోగించుకుంటారు. కొత్త ఆవిష్కరణలు చేయబడతాయని అన్నారు.
2019లో చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో కె శివన్ ఇస్రో ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే చంద్రయాన్-2 పాక్షికంగా విజయవంతమైంది. చంద్రయాన్-2 యొక్క ఆర్బిటర్ విజయవంతంగా కక్ష్యకు చేరుకుంది. అయితే చివరి క్షణంలో ల్యాండర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
చరిత్ర సృష్టించిన భారత్
చంద్రయాన్ -3 సహాయంతో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో నాల్గవ దేశంగా భారతదేశం అవతరించింది. చంద్రుడి దక్షిణ భాగంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో మొదటి మన దేశం నిలిచింది. అమెరికా, రష్యా, చైనాలు కూడా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. కానీ, దక్షిణాది వైపు ఎవరూ ల్యాండింగ్ చేయలేదు. ఎందుకంటే చంద్రుని ఇతర భాగాలతో పోలిస్తే దక్షిణ భాగంలో దిగడం అత్యంత సంక్లిష్టమైన పని.