
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ కొద్దిసేపట్లో చంద్రుడిపై దిగనుంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో చేపట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 'సాఫ్ట్ ల్యాండింగ్' సాధించే ఉద్దేశంతో 2019లో ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ తో టూ వే కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేసింది. చంద్రుడి చుట్టూ కక్ష్యను 25×134 కిలోమీటర్లకు కుదించేందుకు చంద్రయాన్-3 ల్యాండర్ తుది దశ ఆదివారం పూర్తయింది. ఇప్పటి వరకు అంతా సవ్యంగానే ఉందని, ఇప్పటి వరకు ఎలాంటి ఆకస్మిక పరిస్థితులు ఎదురుకాలేదని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
కాగా.. ల్యాండర్ స్థానం దిగడానికి అనుకూలంగా లేదని అంతరిక్ష సంస్థ కనుగొంటే చంద్రుడిపై చంద్రయాన్ -3 ల్యాండింగ్ ఆగస్టు 27కు వాయిదా పడే అవకాశం ఉందని అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ -ఇస్రో డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ సోమవారం తెలిపారు. వాస్తవానికి చంద్రయాన్-3 ల్యాండింగ్ జరగడానికి రెండు గంటల ముందు ల్యాండింగ్ చేయడం సముచితమా కాదా అనే అంశంపై స్పేస్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.