
Chandrayaan-3: ఇస్రో ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్ 3 మిషన్ విజయంవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ప్రపంచ దేశాలు ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. అందులో అస్సాం కు చెందిన నాజిన్ యాస్మిన్, బహరుల్ ఇస్లాం కూడా ఉన్నారు. వారి అనుభవాలను ‘ద వాయిస్ ’ పంచుకున్నారు.
నాజిన్ యాస్మిన్
సెంట్రల్ అస్సాంలోని నాగోన్ జిల్లాకు చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాజిన్ యాస్మిన్ రెండేళ్ల క్రితం అత్యంత కఠినమైన ఎంపిక పరీక్షలో విజయం సాధించి ఇస్రోలో చేరారు. ఈ యువ శాస్త్రవేత్త ఏడాదికి పైగా ఇస్రో ప్రయోగ విభాగంలో రాడార్ ట్రాకింగ్‌లో సేవలందిస్తున్నారు. అయితే.. నజీన్ యాస్మిన్ ప్రయాణం అనుకున్నట్టు అంతా సులభంగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. ఈ అపూర్వ విజయంలో భాగస్వామిగా మారింది.
ఆమె ఆరు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసూతి సెలవులో ఉన్నప్పటికీ ఈ కీలకమైన ఆపరేషన్ల తాను కూడా భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పలుమార్లు ఆమె తన బిడ్డను వెంటబెట్టుకుని ఆఫీసుకు వెళ్లింది. మరోవైపు.. వైవాహిక జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటూ చంద్రయన్-3 మిషన్ లో పాల్గొంది. ఇలా నజ్నీన్ యాస్మిన్ తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించింది.
మారుమూల నాగావ్ జిల్లాలోని జురియా సమీపంలోని మహర్‌పర్‌కు చెందిన అబుల్ కలాం ఆజాద్, మంజిలా బేగంల కుమార్తె, ప్రస్తుత బంగావ్ జిల్లాలోని జూరియా సమీపంలోని మహర్‌పర్‌కి చెందిన కోడలు నజ్నిన్ యాస్మిన్. ఆమె రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో శాస్త్రవేత్తగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
విద్యాభ్యాసం
నజ్నిన్ యాస్మిన్ తన ప్రాథమిక విద్యను సెంట్రల్ అస్సాంలోని నాగావ్ జిల్లాలోని జురియాలోని నూరుద్దీన్ ఫుర్కానియా JB స్కూల్‌లో అభ్యసించింది. ఆమె 2007లో కడమణి టౌన్ హైస్కూల్ నుండి పదో తరగతి పరీక్షలో అద్భుతమైన ఫలితాలు సాధించింది. అనంతరం ఆమె 2009లో ఆల్ఫాబిటా సైన్స్ జూనియర్ కళాశాల నుండి సైన్స్ స్ట్రీమ్‌లోని అనేక సబ్జెక్టులలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులతో XII తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆమె తర్వాత 2013లో NITS మీర్జా కళాశాల- గౌహతి నుండి ఎలక్ట్రానిక్స్‌లో B.Tech, తేజ్‌పూర్ విశ్వవిద్యాలయంలో M.Tech పూర్తి చేశారు. అనంతరం కుటుంబ నేపథ్యం రీత్యా వివిధ ప్రైవేట్ శాస్త్రీయ సంస్థలలో పని చేసింది. ఇదే సమయంలో నజ్నీన్ 2018లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద నేషనల్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించారు.దీంతో పాటు భారత ప్రభుత్వ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు కూడా అర్హత సాధించారు.
భారతదేశపు తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లాను స్ఫూర్తిగా తీసుకుని చిన్నప్పటి నుంచి శాస్త్రవేత్త కావాలని కల కన్నానని యువ శాస్త్రవేత్త నజ్నీన్ యాస్మిన్ అన్నారు. యువతరం తమను తాము బలహీనులుగా భావించవద్దని, కష్టపడి దేశంలోని ప్రముఖ సంస్థల్లో స్థానం సంపాదించేందుకు సిద్ధం కావాలని ఆమె సూచించారు. అలాగే.. నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్బుల్ కలాం జీవితం నుండి తాను ప్రేరణ పొందానని ఆమె పేర్కొంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అస్సాంను ముందుకు తీసుకెళ్లేందుకు నజ్నీన్ తన కెరీర్ ద్వారా ఏదైనా చేయాలనే ఆసక్తిని కూడా వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఆమె నాసాలో పనిచేయాలని యోచిస్తోంది.
బహరుల్ ఇస్లాం బర్భూయాన్
మరోవైపు.. కష్టపడి, నిజాయితీగా పని చేస్తే మనం కన్న కలలన్నీ నిజమవుతాయని నిరూపించాడు అస్సాంలోని హైలకండికి చెందిన బహరుల్ ఇస్లాం బర్భూయాన్. 45 యేండ్ల బహరుల్.. హైలకండి పట్టణానికి సమీపంలోని సయ్యద్‌బంద్ ఖండ్ గ్రామనివాసి. చంద్రయాన్-3 మిషన్ విజయం అనంతరం.. హైలకండి జిల్లా మొత్తం అతని చూసి గర్విస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ మిషన్ లోని ల్యాండర్ దిగి చరిత్ర సృష్టించడంతో బహరుల్ ఇస్లాం పేరు వెలుగులోకి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. బహరుల్ ఇస్లాం ఆ జిల్లాకే ఐకాన్ గా మారారు.
చంద్రయాన్-3 విజయంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలలో ఆయన ఒకరు. ‘ద వాయిస్ ’తో బహరుల్ ఇస్లాం మాట్లాడుతూ.. అంతరిక్ష ప్రపంచంలో రికార్డు సృష్టించిన చారిత్రాత్మక పనిలో పాలుపంచుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. తాను అంతరిక్షంపై ఎప్పుడూ ఆసక్తిని కలిగి ఉన్నాడని శాస్త్రవేత్త బహరుల్ ఇస్లాం చెప్పాడు. చంద్రయాన్-3 విజయంతో యువ తరంలో అంతరిక్ష శాస్త్రం పట్ల ఆసక్తి, ఉత్సుకత పెరుగుతాయని పేర్కోన్నారు.
బహరుల్ ఇస్లాం తన గ్రామం సయ్యద్‌బంద్ లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసాడు. అనంతరం హైలకండి పట్టణంలోని ప్రభుత్వ VMHS పాఠశాలలో మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. ఆ తరువాత బహరుల్ ఇస్లాం SS కళాశాల నుండి BSc, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి మ్యాథ్స్ మాస్టర్, గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి PhD పొందారు. చివరికి ఇస్రోలో ఉద్యోగం సాధించారు. ఇక బహరుల్ తల్లిదండ్రులు విషయానికి వస్తే.. వారిద్దరూ ఉపాధ్యాయులు.
వారు తొలి నాటి నుంచి తమ కొడుకు ప్రారంభ దశల నుండి తన ఇంటిలో సైన్స్ వాతావరణాన్ని సృష్టించారు. ఇటీవలే బహరుల్ ఇస్లాం తండ్రి మొయినుల్ హక్ బర్భూయాన్ మరణించాడు. తల్లి రెహానా కూడా తన కొడుకు బహరుల్ ఇస్లాం సాధించిన విజయాన్ని చూసి ఉత్సాహంగా ఉంది. బహరుల్ సోదరుడు ఇనాముల్ హక్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నా సంతోషాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇంతటి విజయవంతమైన రోజు వస్తుందని అనుకోలేదు. ఇస్రో అపూర్వ విజయంలో నా సోదరుడు కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. అని పేర్కొన్నారు.