
జార్ఖండ్ : జార్ఖండ్ సీఎం చంపై సోరేన్ బల పరీక్షలో విజయం సాధించారు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా 29 ఓట్లు పడగా, అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. బలపరీక్షకు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కూడా హాజరయ్యారు. కోర్టులో పర్మిషన్ తీసుకుని ఆయన దీనికి హాజరయ్యారు. తన అరెస్ట్ వెనుక రాజ్ భవన్ ఉందంటూ సొరేన్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.