Centre Warns Tv Channels: రెచ్చగొట్టే కథనాలు వద్దు: టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

Published : Apr 24, 2022, 04:26 AM ISTUpdated : Apr 24, 2022, 04:34 AM IST
Centre Warns Tv Channels: రెచ్చగొట్టే కథనాలు వద్దు: టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

సారాంశం

Centre Warns Tv Channels: సంచలనం పేరుతో ఇష్టానుసారం వార్తా కథనాలు ప్రసారం చేయోద్దంటూ టీవీ ఛానల్స్‌కి కేంద్రం సూచించింది. ఇటీవ‌ల‌ టీవీ ఛానల్స్ వార్తా ప్రసారాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో టీవీలో ప్రసారం చేసే అంశాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించింది. కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ఓ అడ్వైజరీని విడుదల చేసింది.  

Centre Warns Tv Channels: సంచలనం పేరుతో వివాదాస్పదమైన హెడ్డింగ్‌లు, రెచ్చగొట్టేలా హెడ్‌లైన్స్‌తో ఇష్టానుసారం వార్తా కథనాలు ప్రసారం చేయోద్దంటూ టీవీ ఛానల్స్‌కి కేంద్రం హెచ్చ‌రించింది. న్యూస్‌ ఛానెల్స్‌లో ప్ర‌సార‌మ‌య్యే కంటెంట్‌ విషయంలో ఆచీతూచీ వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ శనివారం ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఢిల్లీ జహంగీర్‌పురి హింసాకాండకు సంబంధించిన వార్తల విషయంలో టీవీ ఛానళ్లు వ్యవహరించిన తీరును ప్ర‌స్తావించింది. రెచ్చిగొట్టే వార్తా ప్రసారాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టెలికాస్ట్ చేసే.. ప్ర‌తి విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించింది. ఉక్రెయిన్ ర‌ష్యా యుద్ద పరిణామాలపై అతిశయోక్తితో కూడిన క‌థ‌నాలను, వివాదాస్పదమైన హెడ్డింగ్‌ల‌తో వార్త క‌థ‌నాల‌ను సృష్టించడాన్ని కేంద్రం హెచ్చ‌రించింది.  

అలాగే ఢిల్లీ జహంగీర్‌పురి ఘ‌ర్ష‌ణ‌లో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మీడియా ఛానెల్స్ ప్ర‌సారం చేసే.. క‌థ‌నాల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. దర్యాప్తునకు ఇబ్బంది కలిగించిందని కేంద్రం అభిప్రాయపడింది. జర్నలిస్టులు నిరాధారమైన మరియు కల్పిత వాదనలు చేస్తూ ప్రేక్షకులను ప్రేరేపించడానికి అతిశయోక్తిని ఉపయోగిస్తున్నారని మంత్రిత్వ శాఖ గుర్తించింది. అలాగే టీవీ ఛానెల్స్‌లో డిబేట్స్‌ సందర్భంగా ఉప‌యోగించే భాష, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, సమాజం అంగీకరించలేని విధంగా ఉన్నాయ‌ని కేంద్రం గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో  పారదర్శకంగా వ్యవహరించాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీని విడుదల చేసింది. 

టీవీ ఛానల్స్‌ కచ్చితంగా కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం 1995 ప్రకారం నడుచుకోవాలని సూచించింది. 

దీనిప్రకారం... 
> కుల, మతాలను రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసారాలు ఉండకూడదు.

> ఇత‌రుల పరువు, ప్రతిష్టలను దెబ్బతినేలా.. ఉద్దేశపూర్వక వార్తలు వేయకూడదు.

> తొందరపాటులో ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. వాటిని వెంటనే ప్రసారం చేయకూడదు

> తప్పుడు వార్తలను, అశ్లీల కథనాలను ప్రసారం చేపుయకుండా జాగ్రత్తపడాలి.

> జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులపై పుకార్లను ప్రసారం చేయకూడదు

> అసత్యాలను వల్లె వేసి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయొద్దు

> సీసీ పుటేజీలతో రెచ్చగొట్టేలా పదే పదే ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలి.

> కథనాలను సగం చెప్పి.. వీక్షకులకు పక్కదారి పట్టించొద్దు.

> ఒకరి మనోభావాలను దెబ్బతీసేలా కథనాలు ఉండకూడదు. 

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్