Sharad Pawar: ఆ విష‌యంలో అమిత్ షా విఫ‌లం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..

Published : Apr 24, 2022, 02:26 AM IST
Sharad Pawar: ఆ విష‌యంలో అమిత్ షా విఫ‌లం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..

సారాంశం

Sharad Pawar:  కేంద్ర‌ప్ర‌భుత్వంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ విరుచుకుపడ్డారు. జహంగీర్ పుర్ ఘటనను ప్రస్తావిస్తూ.. అల్లర్లను నియంత్రించడంలో అమిత్ షా విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర వైఫ‌ల్యంతోనే హనుమాన్ జయంతి ఊరేగింపుల సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో ఘ‌ర్ష‌ణ‌లు చెలరేగాయ‌ని విమ‌ర్శించారు.     

Sharad Pawar: కేంద్ర‌ప్ర‌భుత్వంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మరో సారి  విరుచుకుపడ్డారు. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్ పుర్ లో జరిగిన అల్లర్లపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అల్లర్లను అదుపు చేయడంలో  హోంమంత్రి అమిత్ షా, విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కొన్ని రోజులుగా ఢిల్లీ మతపరమైన గొడవలతో ఉద్రిక్తంగా మారిందన్నారు. 

పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో శనివారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గత హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో జహంగీర్ పుర్ లో జరిగిన అల్లర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీని మతపరమైన అల్లర్ల నుండి రక్షించలేకపోయారని విమ‌ర్శించారు. ఢిల్లీలో ఏమైనా జరిగితే.. ప్రపంచ దేశాల‌కు తెలుస్తోంద‌ని,  ఢిల్లీలో అశాంతి ఉందని ప్రపంచం ఊహించుకుంటుంది. మీకు అధికారం ఉంది, కానీ ఢిల్లీ లో శాంతి భ‌ద్ర‌త‌లను నెల‌కొల్ప‌డంతో కేంద్రం విఫ‌లమైంద‌ని పవార్ అన్నారు.
 
ఓ హోర్డింగ్‌పై మైనారిటీ వర్గాలకు చెందిన దుకాణాలు, వాటి యజమానుల పేర్లు ఉన్నాయని, అలాంటి షాపుల నుంచి వస్తువులు కొనవద్దని దానిపై రాసి ఉందని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదో సాధారణ చిత్రమని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి అన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం