రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్: రుణ పరిమితి 3 నుండి 5 శాతానికి పెంపు

By narsimha lode  |  First Published May 17, 2020, 12:33 PM IST

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు శుభవార్త తెలిపింది. రుణ పరిమితిని పెంచేందుకు అనుమతి ఇచ్చింది. తద్వారా రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల రుణాలను అదనంగా సమకూర్చుకొనే వెసులుబాటు దక్కనుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు శుభవార్త తెలిపింది. రుణ పరిమితిని పెంచేందుకు అనుమతి ఇచ్చింది. తద్వారా రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల రుణాలను అదనంగా సమకూర్చుకొనే వెసులుబాటు దక్కనుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

ఆదివారం నాడు ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రతి రాష్ట్రం తమ రుణాలను మూడు నుండి మూడున్నర వరకు ఎలాంటి షరతులు లేకుండా యధావిధిగా తీసుకొనే వెసులుబాటును కేంద్రం కల్పించింది. అయితే మూడున్నర నుండి ఐదు శాతం వరకు అప్పులు తీసుకొనే వెసులుబాటుకు మాత్రం సంస్కరణలను లింక్ చేసింది. సంస్కరణలను అమలు చేస్తేనే ఈ ఒక్కటిన్నర శాతం అప్పులు తీసుకొనేలా రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇవ్వనున్నట్టుగా తెలిపింది.
 

Latest Videos

2020-21లో రాష్ట్రాల రుణ పరిమితిని రూ. 6.41 లక్షల కోట్లకు పెంచుతున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. అప్పులు తెచ్చుకొనే పరిమితిని ప్రస్తుతం ఉన్న పరిమితికి అదనంగా మరో 5 శాతానికి పెంచుతూ కేంద్రం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. 

కరోనా కారణంగా కేంద్రంతో పాటు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయాయి. దీంతో అప్పులు తెచ్చుకొనేందుకు ఎఫ్ఆర్‌బిఎం పరిమితిని పెంచాలని తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.

also read:విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన,12 ప్రత్యేక ఛానెల్స్: నిర్మలా సీతారామన్

ఎఫ్ఆర్‌బిఎం పరిమితి పెంపుతో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు అప్పులు తెచ్చుకొనేందుకు వెసులుబాటు కలుగుతోంది. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు పన్ను వాటాల్లో రూ. 46,038 కోట్లను అందించనున్నట్టుగా కేంద్రం తెలిపింది.

ద్రవ్యలోటు కింద రాష్ట్రాలకు ఇప్పటికే  రూ. 12,390 కోట్లు ఇచ్చినట్టుగా కేంద్రం తెలిపింది. ఏప్రిల్ నాటికి రూ. 11,092 కోట్లను ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇచ్చామన్నారు. ఆరోగ్యశాఖ నుండి రూ.4,113 కోట్లను రాష్ట్రాలకు అందించినట్టుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

రాష్ట్రాలు అడ్వాన్స్ లు 60 శాతం పెంచుకొనేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టుగా కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాల ఓడీ(ఓవర్ డ్రాఫ్ట్) కాలాన్ని 14 రోజుల నుండి 21రోజులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి చెప్పారు.

జీఎస్‌డీపీ, ద్రవ్యలోటు ఆధారంగా రుణాలు మంజూరు చేయనున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఫైనాన్స్ కమిటీ నివేదిక ఆధారంంగా రుణాలు మంజూరు చేయనున్నట్టుగా కేంద్రం తెలిపింది. పెంచుకొనే రుణాలకు షరతులు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది.

click me!