Har Ghar Dastak 2.0: హర్ ఘర్ దస్తక్ కరోనా వ్యాక్సిన్‌ ప్రచారానికి ప్రారంభించిన‌ కేంద్రం

By Rajesh KFirst Published May 21, 2022, 5:52 AM IST
Highlights

Har Ghar Dastak 2.0: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కోవిడ్-19 వ్యతిరేక వ్యాక్సిన్‌ను పొందడానికి అర్హులైన లబ్ధిదారులందరికీ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చింది. ఆ దిశగా జూన్‌ నుంచి రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' ప్రచారం 2.0 కోసం ప్లాన్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది.  
 

Har Ghar Dastak 2.0: ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి బయటపడి ప్రశాంతంగా జీవిస్తున్నాం.. మ‌రోసారి అలాంటి ప‌రిస్థితుల్లోకి వెళ్ల‌కుండా.. ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ త‌రుణంలో ముంద‌స్తు చర్యగా  సమర్ధవంతమైన కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. తద్వారా కేసుల తగ్గింపును కొనసాగించవచ్చని భావిస్తోంది. ఆ దిశగా జూన్‌ నుంచి రెండు నెలల పాటు 'హర్ ఘర్ దస్తక్' ప్రచారం 2.0 కోసం ప్లాన్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కోవిడ్-19 వ్యతిరేక వ్యాక్సిన్‌ను పొందడానికి అర్హులైన లబ్ధిదారులందరికీ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చింది.

రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాలతో జరిగిన సమావేశంలో.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. కోవిడ్-19 వ్యతిరేక వ్యాక్సిన్‌ల మోతాదును ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకుండా చూసుకోవాలని సూచించారు.  కరోనా కేసుల తగ్గుదలను నిర్వహించడానికి అత్యవసర మిషన్‌గా కోవిడ్-19 నుండి రక్షించడానికి టీకా ప్రచారాన్ని నిర్వహించాల్సిన అవసరాన్ని ఆరోగ్య కార్యదర్శి నొక్కిచెప్పారు. ప్రకటన ప్రకారం, జిల్లా, బ్లాక్ మరియు గ్రామ స్థాయిలలో వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలతో రెండు నెలల పాటు సాగే హర్ ఘర్ దస్తక్ అభియాన్ 2.0 Har Ghar Dastak 2.0 ని ప్లాన్ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భూషణ్ సూచించారు. కరోనా వ్యాక్సిన్ అమూల్యమైన జాతీయ వనరు అని, అది వృధా కాకుండా చూసుకోవాలని ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ నొక్కి చెప్పారు. ఫస్ట్ ఎక్స్‌పైరీ ఫస్ట్ అవుట్ సూత్రం ఆధారంగా గడువు ముగిసిపోనున్న బ్యాలెన్స్‌ వ్యాక్సిన్ మోతాదులను త్వరితగతిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం వినియోగించిలే క్రియాశీలక పరివేక్షణ చేపట్టాలన్నారు. డిసెంబర్ 2021 నుంచి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వారి డిమాండ్‌కి అనుగుణంగా వ్యాక్సిన్ డోస్‌లను సరఫరా చేశామని చెప్పారు.

హర్ ఘర్ దస్తక్ 2.0 Har Ghar Dastak 2.0 ప్రచార లక్ష్యం

ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రజలందరికీ మొదటి, రెండు డోసుల, బూస్టర్‌ డోస్‌లు వేయడం, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలోని వారందరూ వ్యాక్సిన్‌లు తీసుకునేలా దృష్టిసారించడం తదితరాలు హర్ ఘర్ దస్తక్ 2.0' ప్రధాన లక్ష్యమ‌ని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. వ్యాక్సిన్‌ డ్యూ-లిస్ట్‌ల ఆధారంగా సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. 

దేశంలో ఇప్పటివరకు 191.91 కోట్లకు పైగా యాంటీ కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు తీసుకున్న‌ట్టు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, రాత్రి 7 గంటల వరకు 18-59 సంవత్సరాల వయస్సు ఉన్న మొత్తం 16,25,744 మందికి నివారణ డోసులు ఇచ్చారు. 18 ఏళ్లు పైబడిన వారందరూ టీకా యొక్క రెండవ డోస్ తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత ముందు జాగ్రత్త డోస్ తీసుకోవచ్చు.
 

click me!