Tripura BJP MLA Video: కాళ్లు కడిగించుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. నెట్టింట్లో వీడియో వైర‌ల్

By Rajesh KFirst Published May 21, 2022, 4:43 AM IST
Highlights

Tripura BJP MLA Video: ఓ బీజేపీ ఎమ్మెల్యే త‌న‌ నియోజకవర్గంలో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లింది. ఈ క్రమంలో  ఓ పేద మహిళతో కాళ్లు కడిగించుకున్న ఘటన త్రిపురలోని బధర్‌ఘట్‌ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.  
 

Tripura BJP MLA Video: త్రిపురలోని అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే పాదాలను ఒక పేద మహిళ కడిగిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఎమ్మెల్యే పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు. బీజేపీ బదర్‌ఘాట్ ఎమ్మెల్యే మిమీ మజుందార్ త‌న నియోజ‌క‌వ‌ర్గం పశ్చిమ త్రిపురలోని సూర్యపారా అనే ప్రాంతంలో గురువారం రాత్రి పర్యటించారు. ఊరంతా తిరిగి వచ్చాక ఓ పేద మహిళ ఆమె బకెట్‌తో నీళ్లు పోసి సబ్బుతో కడిగి.. తువ్వాలుతో తుడిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నది. దీనిపై నెటిజన్లు, పలు పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎమ్మెల్యే మిమీ మజుందార్ మాత్రం ఆ మహిళ ప్రేమ, ఆప్యాయతతో తన పాదాలను కడిగిందని పేర్కొన్నారు.  

 
బీజేపీ ఎమ్మెల్యే ఏం చెప్పారు?

బదర్‌ఘాట్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ మాజీ ప్రధానోపాధ్యాయురాలు మిమీ మజుందార్‌ 2019లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు టిక్కెట్‌ లభించే కొద్ది రోజుల ముందు బీజేపీలో చేరడం గమనార్హం. ఈ సంఘటన గురించి మిమీ మజుందార్ పిటిఐ-భాషతో మాట్లాడుతూ, "ఒక ఎమ్మెల్యేపై ప్రేమతో  ఓ మహిళ నా పాదాలను కడిగింది. ఆ మహిళ నన్ను తన కూతురుగా భావించి ఇలా చేసింది. దీనిని ప్రతికూల కోణంలో చూడకూడదు. ఒక శాసనసభ్యుడు మంచి పని చేస్తే ప్రజల్లో ఎంత గౌరవం లభిస్తుందో దీన్నిబట్టి అర్థమవుతోంది. నేటి ప్రపంచంలో ఎవరి కాళ్లు కడుక్కోవాలని లేదా అలాంటిదేమీ చేయమని ఎవరూ బలవంతం చేయలేరని నేను నమ్ముతున్నాను. అని వివ‌ర‌ణ ఇచ్చింది.

ప్రతిపక్షాల విమ‌ర్శ‌లు.  

రాష్ట్రంలోని ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో వీడియోను షేర్ చేసింది, “ఫోటో షూట్ తర్వాత, ఒక మహిళ ఎమ్మెల్యే మిమీ మజుందార్ కాళ్ళు కడుక్కోవలసి వచ్చింది.” కాంగ్రెస్‌తో సహా ఇతర రాజకీయ పార్టీలు , ఘటనను కూడా విమర్శించారు.అతను బీజేపీ ఎమ్మెల్యేను ఖండించారు.
 

Tripura BJP MLA Mimi Majumder forced local women to clean her feet at Badharghat as she walked through water after rain.
Video : Social Media. pic.twitter.com/eKtkRaIxvH

— Tripurainfoway (@tripura_infoway)
click me!