విదేశాలకు వెళ్లేవారికి టీకా నిబంధనల సడలింపు.. ఆ దేశ రూల్స్‌కు అనుగుణంగా బూస్టర్ డోసు: కేంద్రం

Published : May 12, 2022, 02:35 PM ISTUpdated : May 12, 2022, 02:38 PM IST
విదేశాలకు వెళ్లేవారికి టీకా నిబంధనల సడలింపు.. ఆ దేశ రూల్స్‌కు అనుగుణంగా బూస్టర్ డోసు: కేంద్రం

సారాంశం

కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసు నిబంధనపై విదేశాలకు వెళ్లేవారికి సడలింపు ఇచ్చింది. విదేశానికి వెళ్లాలనుకుంటున్న భారతీయులు వారి గమ్య దేశంలో అమలు అవుతున్న నిబంధనలకు అనుగుణంగా బూస్టర్ డోసు వేసుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. విదేశాలకు వెళ్లే భారతీయులను ఆయా దేశాలకు బూస్టర్ డోసు వేసుని ఉండాలనే కండీషన్ పెడుతున్నాయి. కానీ, మన దేశంలో బూస్టర్ డోసు కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. సెకండ్ డోసు వేసుకున్నాక 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసుకు అర్హతగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ, విదేశాలకు వెళ్లే భారతీయులకు మాత్రం ఈ నిబంధనను కేంద్రం తాజాగా సడలించింది. విదేశాలకు వెళ్లే భారతీయులు వారి గమ్య దేశం విధిస్తున్న రూల్స్‌కు లోబడి ముందుగానే అంటేతొమ్మిది నెలల కాలం గడవకున్నా బూస్టర్ డోసు వేసుకోవచ్చని ప్రకటించింది.

ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా సోషల్ మీడియా కూ యాప్‌లో వెల్లడించారు. భారతీయ పౌరులు, విద్యార్థులు వారు వెళ్లాదలుచుకున్న దేశాల గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని వెల్లడించారు. ఈ కొత్త సదుపాయం త్వరలోనే కొవిన్‌ పోర్టల్‌లో అందుబాటులోకి వస్తుందని వివరించారు.

ఇటీవలే ఇందుకోసం నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు పంపింది. విదేశాలకు వెళ్లే భారతీయులకు ఆయా దేశాల గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా బూస్టర్ డోసు వేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. అలాంటి వారికి రెండో డోసు తర్వాత బూస్టర్ డోసుకు 9 నెలల గ్యాప్ ఉండాలనే నిబంధన సడలించాలని పేర్కొంది.

ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన వారు బస్టూర్ డోస్ (మూడో డోసు) వేసేందకు కేంద్రం అనుమతించింది. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవిడ్ బూస్టర్ డోస్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నారో.. మూడో డోసుగా కూడా దానినే పొందాలని కేంద్రం స్పష్టం చేసింది. 18 ఏళ్ల వయసు కలిగి రెండో డోసు తీసుకుని కనీసం 9 నెలలు ( 39 వారాలు లేదా 273 రోజులు) బూస్టర్ డోసు పొందడానికి అర్హులుగా కేంద్రం పేర్కొంది. బూస్టర్‌ డోసు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ లేదా వాక్-ఇన్ రిజిస్ట్రేషన్ ద్వారా పొందవచ్చు.

మూడో డోసు పొందడానికి మళ్లీ ప్రత్యేకంగా పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాక్సినేషన్ ప్రోటోకాల్‌ను అనుసరించి వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన వారి రికార్డును వ్యాక్సినేటర్  గుర్తించి.. వివరాలను ధ్రువీకరించుకుని ఆ వివరాలను కోవిన్ యాప్‌లో నమోదు చేయాలని కేంద్రం తెలిపింది. 

కొవిడ్‌ టీకా ప్రికాషన్‌ డోస్‌ ధరలను భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలు తగ్గించాయి. సీరంకొవిషీల్డ్‌ ధర రూ. 600గా ఉండగా.. రూ. 225కు తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా ట్విటర్‌లో ప్రకటించారు. కొవ్యాక్సిన్‌ ధరను రూ. 1,200 నుంచి రూ. 225కు తగ్గిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్లా శనివారం ట్వీట్‌ చేశారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu