కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు శౌర్య పతకాలను ఒకే పతకంగా విలీనం చేసింది. ఇప్పుడు దీనిని ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అనే పేరుతో ప్రదానం చేయనున్నది.ఈ నిర్ణయాన్ని కేంద్రం నేటి నుంచి తక్షణమే అమల్లోకి తెచ్చింది. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అండ్ రిఫార్మ్ సర్వీస్‌ల్లో అత్యున్నత సేవలందించే వారికి శౌర్య పతకాలను అందించే విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ అండ్ రిఫార్మ్ సర్వీస్ ల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచే వారికి (వేరువేరుగా) అందించే శౌర్య పతకాలను ఒకే పతకంగా విలీనం చేసింది. ఇప్పుడు ఈ నాలుగు సేవలకు ఒకే ఒక శౌర్య పతకం అందించనుంది. దీనిని రాష్ట్రపతి శౌర్య పతకం ‘ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ’గా పిలుస్తారు.
ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు సిబ్బందితో పాటు ఇతర సంబంధిత విభాగాలు, సంస్థలకు గౌరవాన్ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఈ చర్య తీసుకోబడింది.
ఇప్పుడు రాష్ట్రపతి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ విశిష్ట సేవ , ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ బదులు ఒకే మెడల్ అందిస్తారు. అదే రాష్ట్రపతి శౌర్య పతకం ‘ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ’ అవార్డు. దీనిని సుదీర్ఘ సేవ, సత్ప్రవర్తన, విధి నిర్వహణ, కార్యదక్షత, ప్రచారం, ఏదైనా కార్యకలాపంలో పాల్గొన్నందుకు పోలీసులను సత్కరిస్తూ ఈ పతకాన్ని అందజేయడం గమనార్హం.
ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. ఇవి ఒకే సమయంలో ప్రకటించబడతాయి. అయితే ప్రతి వర్గానికి అవార్డుల పరిధి విస్తరించబడింది. పేర్కొన్న నోటిఫికేషన్ కాపీలు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల (UTs) యొక్క ప్రధాన కార్యదర్శులు, హోం కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్‌లకు కూడా పంపబడ్డాయి. పోలీసులతో పాటు ఆర్మీకి కూడా అశోక్ చక్ర, వీర్ చక్ర, కీర్తి చక్ర వంటి పతకాలు అందజేస్తారు.