తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో జరిగిన పేలుళ్లలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. బాణాసంచా తయారీ కర్మాగారాల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. విరుదునగర్ జిల్లా కమ్మపట్టి గ్రామంలో జరిగింది.
తమిళనాడులో మరో ఘోర ప్రమాదం జరిగింది. విరుదునగర్ జిల్లాలోని కమ్మపట్టి గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో మొత్తం తొమ్మిది మంది మరణించినట్లు సమాచారం. బాణాసంచా తయారీ కర్మాగారాల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. విరుదునగర్ జిల్లాలోని కమ్మపట్టి గ్రామంలో పేలుడు సంభవించింది. సమాచారం ప్రకారం.. కమ్మపట్టి గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది.
ఈ పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఘటనా ప్రాంతం నుంచి ఐదు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. కాలిన గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
మరోవైపు.. మంగళవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని ఒక సబ్బు కర్మాగారంలో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీని కారణంగా ఫ్యాక్టరీ లోపల ఉన్న కార్మికులు శిధిలాల కింద సమాధి అయ్యారు. దీని కారణంగా నలుగురు మరణించారు. ఏడుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి ఎస్‌ఎస్పీ, డీఎం సహా పోలీసులు చేరుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది.
శిథిలాలను తొలగిస్తుండగా మరో పేలుడు సంభవించింది. NDRF బృందాన్ని కూడా పిలిపించారు. ఈ సందర్భంగా శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా మళ్లీ పేలుడు సంభవించింది. దీంతో దాదాపు 25 అడుగుల మేర ఇంటి శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటనా స్థలంలో ఉన్న పలువురి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు ఘటనాస్థలికి దాదాపు 50 మీటర్ల దూరం జనాలను తరలించారు.