లేఖపై సిడబ్ల్యుసిలో గరం గరం: బీజేపీతో చేరి కుట్రపన్నారని ఆరోపించిన రాహుల్ గాంధీ.

Published : Aug 24, 2020, 12:51 PM ISTUpdated : Aug 24, 2020, 12:59 PM IST
లేఖపై సిడబ్ల్యుసిలో గరం గరం: బీజేపీతో చేరి కుట్రపన్నారని ఆరోపించిన రాహుల్ గాంధీ.

సారాంశం

కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని సీనియర్లు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖ ఇప్పుడు కాంగ్రెస్ ను కుదిపేస్తోంది. ఈ విషయమై నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరుగుతోంది. 

కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని సీనియర్లు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖ ఇప్పుడు కాంగ్రెస్ ను కుదిపేస్తోంది. ఈ విషయమై నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరుగుతోంది. 

ఈ సందర్భంగా తాను తాత్కాలిక అధ్యక్ష పదవినుండి తప్పుకోనున్నట్టు సోనియా గాంధీ తేల్చి చెప్పారు. సిడబ్ల్యుసి సమావేశం చాలా హాట్ హాట్ గా సాగుతుంది. కరోనా కాలం అవడంతో వర్చువల్ గానే ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సాగుతుంది. 

సోనియా గాంధీ తాను తప్పుకుంటాను అని తెగేసి చెప్పడంతో... మన్మోహన్ సింగ్ ఆమెను పునరాలోచిచావలిసిందిగా కోరారు. ఏకే ఆంటోనీ సైతం ఇదే విషయాన్నీ వెల్లడించారు. 

రాహుల్ గాంధీ ఈ లేఖపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. సోనియా గాంధీ అనారోగ్యంతో ఉన్న సమయంలో ఈ లేఖను  రాయడమేమిటని ప్రశ్నించారు. ఈ లేఖ ఎలా లీక్ అయిందంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలియవస్తుంది. బీజేపీతో చేరి కుయుక్తులు పన్ని ఈ లేఖ రాసారని  రాహుల్ ఆరోపించారు. సోనియా గాంధీ మాత్రం తాను తప్పుకోనున్నానని తెగేసి చెప్పినట్టుగా సమాచారం. 

ఇప్పటికే మధ్యప్రదేశ్ లో అధికారం కోల్పోయి, మొన్ననే రాజస్థాన్ లో సంక్షోభం నుండి బయటపడి ఉన్న ఈ బలహీన తరుణంలో లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. బీజేపీతో కలిసి కుట్రపన్నారని రాహుల్ ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu