Monkeypox: దేశంలో 9కి చేరిన మంకీపాక్స్ కేసులు.. కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం..!

By Sumanth KanukulaFirst Published Aug 4, 2022, 11:44 AM IST
Highlights

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు దేశంలో 9 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే దేశంలో పెరుగుతున్న మంకీ పాక్స్ కేసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది.

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు దేశంలో 9 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే దేశంలో పెరుగుతున్న మంకీ పాక్స్ కేసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఉన్నత ఆరోగ్య నిపుణులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) డైరెక్టర్ ఎల్ స్వస్తిచరణ్ అధ్యక్షత వహిస్తారు. మంకీపాక్స్‌ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను ఈ సమావేశంలో పునఃసమీక్షించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా.. నిన్న ఢిల్లీలో ఓ 31 ఏళ్ల మహిళకు మంకీ పాక్స్ పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9కి చేరింది. అందులో ఢిల్లీలో 4, కేరళలో 5 కేసులు ఉన్నాయి. అయితే తాజాగా ఢిల్లీలో మంకీపాక్స్ నిర్దారణ అయిన మహిళకు ఇటీవలి కాలంలో ఎలాంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేనట్టుగా తేలింది. మహిళకు జ్వరం, చర్మ గాయాలు ఉన్నట్టుగా.. ఆమెను లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఆమె నమూనాలను పరీక్షలకు పంపగా బుధవారం పాజిటివ్‌గా వచ్చింది.

click me!