కన్నకూతురిపై కన్నేసిన తండ్రి.. మగబిడ్డ పుట్టడంతో విషయం వెలుగులోకి...

Published : Aug 04, 2022, 11:21 AM IST
కన్నకూతురిపై కన్నేసిన తండ్రి.. మగబిడ్డ పుట్టడంతో విషయం వెలుగులోకి...

సారాంశం

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఆ చిన్నారి పాలిట కామాంధుడిగా మారాడు. ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భిణిగా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

తమిళనాడు : తమిళనాడులో ఓ కన్నతండ్రి కామాంధుడిగా మారాడు. సభ్య సమాజం తలదించుకునే నీఛత్వానికి దిగజారాడు. వావివరుసలు మరిచి అల్లాడు ముద్దుగా చూసుకోవాల్సిన కూతురి మీదే కన్నేశాడు. ఆమె మీద పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆమెకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. గర్భిణి అని తేలింది. అప్పుటికే నెలలు నిండడంతో వైద్యులు ఆపరేషన్ చేసి పండంటి మగబిడ్డను బైటికి తీశారు.

ఆ తరువాత కానీ అసలు విషయం వెలుగులోకి రాలేదు. అప్పటివరకు వైద్యం చేసిన వైద్యులకు ఆమెకు పెళ్లి కాలేదన్న సంగతి తెలియలేదు. అది తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆరా తీయగా.. ఈ నిర్వాకం అంతా కన్నతండ్రిదేనని తెలిపి.. షాక్ అయ్యారు. వివరాల్లోకి వెడితే..

హోటల్ గదిలో ఉరికి వేలాడుతూ యువతి... ఆత్మహత్యకాదు.. హత్యాచారం అంటున్న తండ్రి..

వేలూరు జిల్లా విరింజిపురం గ్రామానికి చెందిన 45యేళ్ల వయసున్న ఓ వ్యక్తి వెల్డింగ్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఎనిమిదినెలల క్రితం వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. ఇతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 13 యేళ్ల కుమార్తె అదే గ్రామంలోని తాతయ్య ఇంట్లో పెరుగుతోంది. ప్రతిరోజూ తాతయ్య ఇంటినుంచి తండ్రికి భోజనం క్యారేజ్ తీసుకువెడుతుంది. 

ఈ క్రమంలో గత సోమవారం ఉదయం బాలికకు కడుపునొప్పి  వచ్చింది. దీంతో వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల్లో ఆమె గర్భిణిగా తేలింది. ఈ క్రమంలో బాలికకు శస్త్ర చికిత్స చేసి మగబిడ్డను బయటకు తీశారు. వైద్య సిబ్బంది బాలికను ఆరా తీయగా వివాహం జరగలేదని తెలిసింది. దీంతో వైద్యులు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ జరిపించారు. గర్భం రావడానికి కన్నతండ్రే కారణమని బాలిక తెలపడంతో పోలీసులు అతన్ని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆ తరువాత సెంట్రల్ జైలుకు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !