
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటనలో కీలక ప్రకటన చేశారు. ఆదివారం నాడు చెన్నైలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో సుధీర్ఘంగా ఉన్న డిమాండ్ పై ఆయన స్పందించారు.
దేవేంద్ర కుల వెల్లార్ సామాజిక వర్గానికి చెందిన సమస్యపై ప్రధాని కీలక ప్రకటన చేశారు. పల్లార్, కుదుంబం, కల్లాడి, పన్నాడీ, వాత్రీయాన్,దేవీంద్రీయన్ లు ఎస్సీలో ఏడు వేర్వేరు కేటగిరిల కింద ఉన్నారు. వీరంతా ఒకే కేటగిరి కిందకు తీసుకురావాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది.
దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన జనాభా సుమారు 40 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ ఏడు సామాజిక వర్గాల ప్రతినిధులు చాలా ఏళ్లుగా ఈ డిమాండ్ ను ఆయా ప్రభుత్వాల ముందుంచాయి. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అంతేకాదు ఎస్సీ జాబితా నుండి తమను తొలగించి ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరుతున్నారు.
అయితే ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ కేంద్రానికి ఈ విషయమై కీలక సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం అంగీకరించింది.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ పార్లమెంట్ లో బిల్లును పెట్టనున్నట్టుగా ప్రధాని మోడీ ఆదివారం నాడు చెన్నైలో ప్రకటించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఏడు వేర్వేరు కులాలకు చెందిన వారిని దేవేంద్ర కుల వెల్లరార్ గా పిలుస్తారు
ఈ ఏడు ఉప గ్రూపులు ఒకే కేటగిరిగా మారనున్నాయి. పార్లమెంట్ లో బిల్లు పాసైతే వీరంతా దేవేంద్ర కుల వెల్లరార్ కేటగిరిలోకి వస్తారు.