భారత అమ్ముల పొదిలోకి అర్జున్: సైన్యానికి అప్పగించిన మోడీ

By narsimha lodeFirst Published Feb 14, 2021, 1:14 PM IST
Highlights

భారత సైన్యం అమ్ముల పొదిలోకి అర్జున్ యుద్దట్యాంక్ చేరింది. ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యుద్ద ట్యాంక్ ను సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు చెన్నైలో అప్పగించారు.

చెన్నై: భారత సైన్యం అమ్ముల పొదిలోకి అర్జున్ యుద్దట్యాంక్ చేరింది. ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యుద్ద ట్యాంక్ ను సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు చెన్నైలో అప్పగించారు.

చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో అర్జున్ ట్యాంక్ ను సైన్యానికి ప్రధాని అప్పగించారు. తేజస్ తర్వాత ఆత్మ నిర్బర్ భారత్ కింద భారత దళాలకు చెందిన మరో అతి పెద్ద యుద్ద ట్యాంక్ అర్జున్.సుమారు 71 చిన్న, పెద్ద మార్పులతో అర్జున్ మార్క్ 1 ఏ రూపంలో అప్‌డేటెడ్ వెర్షన్ ను తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలోని ఆయుధాలతో పోటీపడేలా సిద్దమైంది.

త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలుజరగనున్నాయి.ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోడీ ఇవాళ చెన్నైకి వచ్చారు.చెన్నైలోని డిఫెన్స్ రీసెర్చ్ , డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీన్ని అభివృద్ది చేసింది.రక్షణ మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో 118 అర్జున్ మార్క్ 1 ఎ ట్యాంకులను భారత సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీని ధర సుమారు రూ. 48,400 కోట్లు ఉంటుందని అంచనా.

దీని బరువు 68 టన్నులుగా ఉంటుంది. 120 ఎంఎం రౌండ్స్ వినియోగించే గన్ ను దీనికి అమర్చారు. ఈ ట్యాంక్  గన్ లోని లక్ష్యాన్ని ఆటోమెటిక్ గా ట్రాక్ చేసే ప్రత్యేక వ్యవస్థను అమర్చారు.

click me!