భద్రతా సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలం - సోనియా గాంధీ

Published : Dec 22, 2022, 12:28 PM ISTUpdated : Dec 22, 2022, 12:32 PM IST
భద్రతా సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలం - సోనియా గాంధీ

సారాంశం

పార్లమెంట్ లో చైనాతో మన దేశానికి ఉన్న సరిహద్దులపై సమస్యలపై చర్చను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతుకలను నిలువరిస్తోందని చెప్పారు. 

సరిహద్దు పరిస్థితులపై పార్లమెంటులో చర్చకు అనుమతి నిరాకరించినందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం విరుచుకుపడ్డారు. భద్రతా సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమయ్యిందని, ఇది ఆందోళకరమని అన్నారు. ఈ మేరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో పార్టీ ఎంపీలతో సోనియా మాట్లాడారు. చర్చలను అడ్డుకుంటూనే, ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతులను లక్ష్యంగా చేసుకోవడంలో, మీడియాను తారుమారు చేయడంలో, తనకు అడ్డుగా ఉన్న సంస్థలను నిర్వీర్యపర్చడంలో బీజేపీ చురుకుగా నిమగ్నమై ఉందని అన్నారు.

పెరుగుతున్న చలిగాలులు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం : ఐఎండీ

“మన సరిహద్దులోకి చైనా చొరబాట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో ఈ దాడులను అప్రమత్తంగా తిప్పికొట్టిన మన సైనికులకు దేశం మొత్తం అండగా నిలుస్తోంది. అయితే ప్రభుత్వం మొండిగా పార్లమెంటులో ఈ అంశంపై చర్చకు అనుమతిని నిరాకరిస్తోంది.” అని సోనియా గాంధీ అన్నారు. “మనపై నిరంతరం దాడి చేయడానికి చైనా ఎందుకు ధైర్యం చూపిస్తోంది.? ఈ దాడులను తిప్పికొట్టేందుకు ఎలాంటి సన్నాహాలు చేశారు. ఇంకా ఏమి చేయాలి? భవిష్యత్ చొరబాట్ల నుండి చైనాను నిరోధించడానికి ప్రభుత్వ విధానం ఏమిటి? ’’ అని అన్నారు.

బీఎఫ్ -7 వేరియంట్ భారత్ పై తీవ్ర ప్రభావం చూపకపోవచ్చు - ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ సంజయ్

ప్రభుత్వం చైనాతో అనుసరిస్తున్న విధానంపై సోనియా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మన దేశం నుంచి చైనాకు ఎగుమతుల కంటే, ఆ దేశం నుంచి దిగుమతులే ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు. ‘‘ చైనాతో మనకు తీవ్రమైన వాణిజ్య లోటు ఉంది. మనం ఎగుమతి చేసే దానికంటే చాలా ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నప్పుడు ? చైనా సైనిక శత్రుత్వానికి ఆర్థిక ప్రతిస్పందన ఎందుకు లేదు? ప్రపంచ సమాజానికి ప్రభుత్వం దౌత్యపరంగా ఎలా చేరువవుతోంది?' అని కాంగ్రెస్ ఆమె ప్రశ్నించారు. 

గగన్‌యాన్ మిషన్ ఆలస్యం.. 2024 నాల్గో త్రైమాసికంలో ప్ర‌యోగించ‌నున్న‌ట్టు కేంద్రం వెల్ల‌డి

న్యాయవ్యవస్థను ‘డీలీజిటైజ్ (చట్టవిరుద్దం)’ చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సోనియా ఆరోపించారు. వివిధ కారణాలపై న్యాయవ్యవస్థపై దాడి చేసే ప్రసంగాలు చేయడానికి మంత్రులను చేర్చుకున్నారని ఆమె అన్నారు. 

చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు.. డబ్లూహెచ్ఓ ఆందోళన.. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన

కాగా.. సోనియా గాంధీ న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. కేంద్రానికి, న్యాయవ్యవస్తకు మధ్య ఎలాంటి వైరుధ్యం లేదని అన్నారు. పార్లమెంటులో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తన విధి అని, ఇది న్యాయవ్యవస్థపై దాడి కాదని ఆయన స్పష్టం చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?