బీఎఫ్ -7 వేరియంట్ భారత్ పై తీవ్ర ప్రభావం చూపకపోవచ్చు - ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ సంజయ్

By team teluguFirst Published Dec 22, 2022, 11:34 AM IST
Highlights

కొత్తగా వెలుగు చూసిన కరోనా బీఎఫ్ -7 వేరియంట్ మన దేశంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ సంజయ్ రాయ్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. బీఎఫ్ -7 వేరియంట్ పై కూడా ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. దీంతో భారత్ లో కూడా టెన్షన్ మొదలైంది. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు. చైనాలో చూపిస్తున్నట్టుగా ఆ వేరియంట్ భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపకపోవచ్చని ఆయన తెలిపారు. 

గగన్‌యాన్ మిషన్ ఆలస్యం.. 2024 నాల్గో త్రైమాసికంలో ప్ర‌యోగించ‌నున్న‌ట్టు కేంద్రం వెల్ల‌డి

ఈ మేరకు ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో మాట్లాడారు. ‘‘భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారు సురక్షితంగా ఉన్నారని నిరూపించడానికి మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి. అన్ని వేరియంట్లను పర్యవేక్షించడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్ వల్ల మనం తీవ్రమైన సమస్యను ఎదుర్కొనే అవకాశం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. 

బీఎఫ్ -7 సబ్ వేరియంట్ మొదటి కేసును సెప్టెంబర్ లో ఒడిశాలో, రెండో కేసును నవంబర్ లో గుజరాత్ రాష్ట్రంలో కనుగొన్నారు. అయితే ఇదే వేరియంట్ చైనాలో భయంకరంగా కేసులు పెరుగుదలకు కారణమవుతోందని భావిస్తున్నారు.

నైట్రోజన్‌ గ్యాస్ పీల్చి టెకీ ఆత్మహత్య.. మూసి ఉన్న కారులో, ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని మరీ...

ఇదిలావుండగా చైనాతో పాటు ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో దేశంలో కరోనా కేసుల పరిస్థితిని సమీక్షించారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం వంటి కోవిడ్ ప్రవర్తనా నియామవళిని పాటించాలని కోరారు. 

ఇప్పటి వరకు కరోనా కేసుల్లో పెద్దగా పెరుగుదల లేదని చెప్పారు. అయినా కోవిడ్ ను ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తిగా సన్నద్ధమవ్వాలని, నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు.  ఇదే సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. భారతదేశంలో అర్హతగల జనాభాలో కేవలం 27 నుంచి 28 శాతం మంది మాత్రమే కోవిడ్ బూస్టర్ డోస్‌ తీసుకున్నారని అన్నారు. ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తెలిపారు. ‘‘ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులు తప్పకుండా ఈ నిబంధన పాటించాలి’’ అని చెప్పారు.

కరోనాపై కేంద్రంపై అప్రమత్తం.. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం..

కాగా.. కొత్తగా నమోదవుతున్న కేసుల వివరాలను ప్రతీ రోజు అప్ డేట్ చేయాలని, పాజిటివ్ నమూనాలను క్రమబద్ధీకరించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో అభ్యర్థించారు. కరోనా ఆందోళనల నేపథ్యంలో నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ సమావేశం చేపట్టనున్నారు. ఇందులో దేశంలో కోవిడ్-19కి కేసుల్లో పెరుగుదల, దానిని ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలను మోడీ సమీక్షించనున్నారు. అధికారులకు అవసరమైన సూచనలు చేయనున్నారు. 

click me!