ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. మద్యాహ్నం 12 గంటలకు సీఈసీ ప్రెస్ మీట్ లో ఈ వివరాలు వెల్లడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడనేది ఈ రోజు తేలనుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈ ప్రెస్ మీట్ లో ప్రకటించనుంది సీఈసీ.
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నాయి. అయితే, ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వేరు వేరు తేదీల్లో నిర్వహించనున్నాయి.
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రాజస్థాన్లో 200, చత్తిస్గఢ్లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిజోరాంలో 40 స్థానాలు, మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో మూడు రోజులు పర్యటించింది. ఎన్నికలు జరపడానికి సంబంధించిన అంశాలన్నీ పరిశీలించింది. ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ రాగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇప్పటివరకు అధికారబీఆర్ఎస్ తప్ప వేరే పార్టీలేవీ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో సీఈసీ ప్రెస్ మీట్ తో ఇది ఊపందుకునే అవకాశం ఉంది.