ఎంట్రన్స్ టెస్టులు, బోర్డు పరీక్షల నిర్వహణ: రేపు కేంద్రం హైలెవల్ భేటీ

By Siva KodatiFirst Published May 22, 2021, 7:41 PM IST
Highlights

కరోనా కారణంగా వాయిదా పడ్డ వివిధ పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రేపు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్‌ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

కరోనా కారణంగా వాయిదా పడ్డ వివిధ పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రేపు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్‌ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల కార్యదర్శులు, బోర్డు ఛైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పరీక్షల నిర్వహణపై వివిధ రాష్ట్రాలకు కేంద్రం ఈ మేరకు లేఖలు రాసింది.

Also Read:కరోనా వైరస్ : దేశంలో పెరుగుతున్న పరీక్షలు, కలవరపెడుతున్న మరణాలు..

కాగా, దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, వివిధ రాష్ట్రాల బోర్డులు ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ప్రొఫెషనల్‌ కోర్సుల ఎంట్రన్స్‌ పరీక్షలను వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రమేష్‌ పోక్రియాల్ ఈ పరీక్షల నిర్వహణపై వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ట్విట్టర్‌ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు.

click me!