కేంద్రాన్ని వదలని కేజ్రీవాల్... వీటిని ఆచరణలో పెట్టండి, టీకా కొరతపై 4 సూచనలు

By Siva KodatiFirst Published May 22, 2021, 4:59 PM IST
Highlights

సింగపూర్ వేరియెంట్ అంటూ విమర్శలు చేసి ఇబ్బందుల్లో పడ్డ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. కానీ అనేక రాష్ట్రాల్లో ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. 

సింగపూర్ వేరియెంట్ అంటూ విమర్శలు చేసి ఇబ్బందుల్లో పడ్డ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. కానీ అనేక రాష్ట్రాల్లో ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.

ఇంకా 45 ఏళ్లు పైబడినవారికే ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకు కారణం టీకాల నిల్వలు లేకపోవడమే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్రానికి పలు సూచనలు చేశారు. 

* భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకా ఉత్పత్తిని తప్పనిసరి చేస్తూ దేశంలో ఉన్న వ్యాక్సిన్‌ తయారీ సంస్థలన్నింటికీ ఆదేశాలు జారీ చేయాలి. 24 గంటల్లో ఆ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి వ్యాక్సిన్ డోసుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేయాలి.   

* విదేశీ టీకా తయారీ సంస్థల నుంచి కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. 

* కొన్ని దేశాలు వారి జనాభాకు సరిపడే కంటే ఎక్కువ వ్యాక్సిన్లు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నాయి. వాటిని వెంటనే భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలి.   

* విదేశీ టీకా తయారీ సంస్థలకు భారత్‌లో టీకాలు ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలి.  

Also Read:మిత్ర దేశాలతో శత్రుత్వం తీసుకురావొద్దు, కేజ్రీవాల్ కి ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ చురకలు

మరోవైపు ఢిల్లీలో వయోజనులకు టీకా ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ్టీ నుంచి నిలిపివేసినట్లు కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు దేశ రాజధానిలో 50 లక్ష డోసుల్ని ప్రజలకు అందజేశామని సీఎం వెల్లడించారు. ఢిల్లీ మొత్తానికి టీకా అందించేందుకు మరో 2.5 కోట్ల టీకా డోసులు అవసరమని ఆయన స్పష్టం చేశారు. కానీ కేంద్రం నెలకు 8 లక్షల డోసులు మాత్రమే పంపితే అందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు 30 నెలలు పడుతుందని కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. 

click me!