మాది పనికిమాలిన వైద్యమా.. బాబా రాందేవ్‌పై డాక్టర్ల సంఘం ఆగ్రహం

By Siva KodatiFirst Published May 22, 2021, 7:25 PM IST
Highlights

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి (ఆధునిక ఇంగ్లీషు వైద్య విధానం)పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి (ఆధునిక ఇంగ్లీషు వైద్య విధానం)పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడిలో అల్లోపతి విఫలమైందని, అదో పనికిమాలిన వైద్యమని, ఆ వైద్య విధానం పనిచేయకపోవడం వల్లనే దేశంలో లక్షల ప్రాణాలు పోతున్నాయంటూ రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యల్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా పరిగణించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాందేవ్ బాబా మాటలు ఉన్నాయని, ఆయనపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది.

Also Read:షాకింగ్ : 420 మంది డాక్టర్లను బలితీసుకున్నసెకండ్ వేవ్, ఒక్క ఢిల్లీలోనే 100మంది...

ప్రతి రోజూ ఎన్నో లక్షల మంది డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి మరీ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారని తెలిపింది. వారందరి శ్రమను రాందేవ్ చాలా చులకనగా మాట్లాడారని, ఇది క్షమించరాని నేరమంటూ ఐఎంఏ మండిపడింది. 

click me!