దేశవ్యాప్తంగా 75 మెడికల్ కళాశాలలు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే......

By Nagaraju penumalaFirst Published Aug 28, 2019, 7:27 PM IST
Highlights

 దేశవ్యాప్తంగా 75 మెడికల్ కళాశాలలు ప్రకటించడంతో 45 వేల ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కళాశాలల కోసం రూ.24,375 కోట్ల రూపాయలను కేటాయించింది.  
 

న్యూఢిల్లీ: కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 75 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 75 మెడికల్ కళాశాలలు ప్రకటించడంతో 45 వేల ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మెడికల్ కళాశాలల కోసం రూ.24,375 కోట్ల రూపాయలను కేటాయించింది.  

మరోవైపు చెరకు రైతులకు సబ్సిడీ పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది. 60 వేల టన్నుల చక్కెర ఎగుమతికి సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  దాంతో చెరకు రైతులకు రూ. 6,268 కోట్ల సబ్సిడీ అందనుంది. 

 వీటితోపాటు రైతులకు నగదు బదలాయింపు చేయాలని నిర్ణయించారు. అలాగే ఆర్థిక స్థిరీకరణకు కూడా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 

click me!