తమిళనాడులో మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు: తెలంగాణ హైకోర్టుకు బదిలీ

By Nagaraju penumalaFirst Published Aug 28, 2019, 6:43 PM IST
Highlights

బాధితురాలు విజ్ఞప్తి మేరకు మద్రాస్ హైకోర్టు లైంగిక వేధింపుల కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. లైంగిక వేధింపుల కేసు మెుత్తాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఫైల్స్ ను తెలంగాణ సీఎస్ కు అందజేయాలని తమిళనాడు డీజీపీని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. 

తమిళనాడు: తమిళనాడులో మహిళా ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపులు కేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళా ఎస్పీ తన  కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది. 

బాధితురాలు విజ్ఞప్తి మేరకు మద్రాస్ హైకోర్టు లైంగిక వేధింపుల కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. లైంగిక వేధింపుల కేసు మెుత్తాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఫైల్స్ ను తెలంగాణ సీఎస్ కు అందజేయాలని తమిళనాడు డీజీపీని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. 

మహిళా ఎస్పీపై లైంగిక వేధింపుల కేసును పూర్తిస్థాయిలో విచారించి ఆరు నెలల్లోగా నివేదిక అందజేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఇకపోతే ఐజీ స్థాయి అధికారి మురుగన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఇంటర్నల్ కమిటీకి ఫిర్యాదు చేశారు మహిళా ఎస్పీ. 

దాంతో 2018 ఆగష్టు21న కేసు నమోదైంది. పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఈ కేసుపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విచారణకు మధ్యంతర కమిటీని నియమించింది. 

ఆ కమిటీకి మహిళా ఎస్పీ తన ఆవేదనను స్పష్టం చేసింది. ఉన్నతాధికారి తనను ఎలా వేధిస్తున్నాడో అన్న వాటిని గ్రాఫిక్స్ ద్వారా కమిటీకి వివరించింది. చాలాసార్లు ఐజీ తనను కౌగిలించుకున్నాడని తాను వ్యతిరేకించడంతో వేధించడం మెుదలుపెట్టినట్లు ఆమె కమిటీ ఎదుట వాపోయింది.  

అయితే తమిళనాడులో తీవ్రంగా ఒత్తిడులు ఉన్న నేపథ్యంలో కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని మహిళా ఎస్పీ మద్రాస్ హైకోర్టును ఆదేశించింది. దాంతో మద్రాస్ హైకోర్టు కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. 

 

click me!