గ్యాస్ వినియోగదారులకు షాక్.. మరోసారి పెరగనున్న సిలిండర్ ధర, రూ.1000కి చేరే అవకాశం

Siva Kodati |  
Published : Sep 23, 2021, 03:53 PM IST
గ్యాస్ వినియోగదారులకు షాక్.. మరోసారి పెరగనున్న సిలిండర్ ధర, రూ.1000కి చేరే అవకాశం

సారాంశం

రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్‌ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. దాదాపు రూ.1,000 వరకు పెరుగుతుందని సమాచారం. అయితే, ఎల్‌పిజి సిలిండర్ల ధరలను పెంచడంపై అలాంటి వార్తలేవీ ప్రభుత్వం నుంచి బయటకు రాలేదు. 

ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు పెరిగి సామాన్యుడు అల్లాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు సైతం ఆందోళన నిర్వహిస్తున్నాయి. గత పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్‌ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. దాదాపు రూ.1,000 వరకు పెరుగుతుందని సమాచారం. అయితే, ఎల్‌పిజి సిలిండర్ల ధరలను పెంచడంపై అలాంటి వార్తలేవీ ప్రభుత్వం నుంచి బయటకు రాలేదు. 

మీడియా నివేదికల ప్రకారం, ఎల్‌పీజీ సిలిండర్ సబ్సిడీకి సంబంధించి ప్రభుత్వం రెండు స్టాండ్‌లు తీసుకోవచ్చని తెలుస్తోంది. మొదటిది, ప్రభుత్వం ఇప్పుడున్నట్లుగానే నడుస్తుంది. రెండవది, ఉజ్వల పథకం కింద, ఆర్థికంగా బలహీనమైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలి. అయితే, సబ్సిడీ ఇవ్వడం గురించి కేంద్రం స్పష్టంగా ఏమీ చెప్పలేదు. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. పెట్రోల్, డీజిల్ విషయంలో ప్రభుత్వ వైఖరి గమనిస్తే.. రెండో ఆప్షన్ కేంద్రం తీసుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో దాదాపు 29 కోట్ల మందికి ఎల్‌పిజి కనెక్షన్‌లు ఉన్నాయి. ఇందులో ఉజ్జ్వల పథకం కింద దాదాపు 8 కోట్ల LPG కనెక్షన్లు ఉన్నాయి.

గడిచిన ఒకటిన్నర సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెండింతలు పెరిగింది. అలాగే గత ఏడున్నర సంవత్సరాలలో దేశీయ గ్యాస్ సిలిండర్ ధర (14.2 కిలోలు) రెట్టింపు అయింది. 2014 మార్చి 1 న 14.2 కిలోల దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ. 410.50 అయితే ఇప్పుడు అది రూ. 884.50కు చేరింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌