ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం ₹ 3,260.79 కోట్లు ఖర్చుచేసిన కేంద్రం

By Mahesh RajamoniFirst Published Dec 13, 2022, 11:01 PM IST
Highlights

New Delhi: మొత్తం ఎనిమిదేళ్ల పాల‌న‌లో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2017-18, 2020-21, 2021-22, 2022-23 మినహా, ఎలక్ట్రానిక్ మీడియా కంటే ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
 

Electronic Media advertisements Govt spent: కేంద్ర‌లో అధికారంలో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌ల కోసం భారీగానే ఖ‌ర్చు చేసింది. 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం రూ.3,260.79 కోట్లు ఖ‌ర్చు చేసింది. ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం రూ.3,230.77 కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర‌ సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం లోక్ సభలో తెలిపారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ఎంపీ మునియన్ సెల్వరాజ్ అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఠాకూర్ సమాధానమిస్తూ, ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రకటనల కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రకటనల వ్యయాన్ని ఏడాది వారీగా విభజించి వెల్ల‌డించారు. కేంద్ర మంత్రి అందించిన సమాచారం ప్రకారం, 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 609.15 కోట్ల రూపాయలు ఖర్చు ఎలక్ట్రానిక్ మీడియాలో చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.531.60 కోట్లు, 2018-19లో రూ.514.28 కోట్లు ప్ర‌క‌ట‌న‌ల కోసం ఖర్చు చేశారు.

ఈ ఏడాది డిసెంబర్ 7 వరకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం వ‌రుస‌గా రూ.91.96 కోట్లు, రూ.76.84 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్ల‌డించిన డేటా పేర్కొంది. 2014-15లో ప్రింట్ మీడియాకు రూ.424.84 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.473.67 కోట్లు ప్ర‌క‌ట‌న‌ల కోసం ఖర్చు చేశారు. 2019-20లో ప్రింట్ మీడియాపై రూ.295.05 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాపై రూ.317.11 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియాపై రూ.179.04 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాపై రూ.101.24 కోట్లు ప్ర‌క‌ట‌న‌ల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. 2017-18, 2020-21, 2021-22, 2022-23 మినహా, ఎలక్ట్రానిక్ మీడియా కంటే ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధిక మొత్తంలో ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. విదేశీ మీడియాలో ప్రకటనలపై ప్రభుత్వ వ్యయంపై అడిగిన ప్రశ్నకు ఠాకూర్ సమాధానమిస్తూ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా విదేశీ మీడియాలో ప్రకటనల కోసం ఎటువంటి ఖర్చు చేయలేదని చెప్పారు.

అలాగే, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వర్ధమాన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి ప్రపంచ స్థాయి శిక్షణా సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఖేలో ఇండియా స్కీమ్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లకు సహాయం, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ ప్రమోషనల్ స్కీమ్‌ల ద్వారా దీనిని సాధించగలిగామని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 23 మల్టీపర్పస్ హాల్స్‌తో సహా 30 స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి అని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఠాకూర్ తెలిపారు. ఖేలో ఇండియా పథకం కింద మంత్రిత్వ శాఖ ఝాన్సీ జిల్లాలో ఒక ఖేలో ఇండియా కేంద్రాన్ని మంజూరు చేసిందని ఆయన చెప్పారు.

click me!