బెంగళూరులో ఏటీఎం మెషీన్‌ను ట్రక్కులో ఎత్తుకెళ్లిన దొంగలు.. అందులో ఉన్న డబ్బులు ఎన్నంటే?

Published : Dec 13, 2022, 07:43 PM IST
బెంగళూరులో ఏటీఎం మెషీన్‌ను ట్రక్కులో ఎత్తుకెళ్లిన దొంగలు.. అందులో ఉన్న డబ్బులు ఎన్నంటే?

సారాంశం

బెంగళూరులో ఏటీఎం మెషీన్‌ను ఐదుగురు దొంగలు ఎత్తుకెళ్లారు. బ్యాక్ సైడ్ ఓపెన్‌గా ఉంచిన ట్రక్కులో వారు ఏటీఎం మెషీన్‌ను తీసుకెళ్లారు. ఆ తర్వాత అందులో నుంచి డబ్బులు తీసుకుని ఖాళీ ఏటీఎంను బయట పడేశారు.  

న్యూఢిల్లీ: కర్ణాటకలో ఐదుగురు దొంగలు ఏకంగా ఏటీఎం మెషీన్‌నే ఎత్తుకెళ్లారు. ఓ ట్రక్కు తీసుకువచ్చి.. మెషీన్‌ను అందులో ఎక్కించారు. అందులో నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత బెంగళూరు ఔటర్‌లో ఖాళీ ఏటీఎం మెషీన్‌ను పడేశారు. శనివారం రాత్రి 2.45 గంటలకు ఈ చోరీ జరిగినట్టు పోలీసు అధికారులు తెలిపారు. 

బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంను వారు దొంగిలించారు. చోరీ చేసే సమయంలో అందులో రూ. 3.13 లక్షల నగదు ఉన్నట్టు అధికారులు వివరించారు. వారు చోరీ చేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. దొంగతనం చేసిన ఐదుగురిని పోలీసులు గుర్తించారు. అందులో నలుగురు పరారీలో ఉండగా.. ఒకరిని పట్టుకున్నారు. కర్ణాటకలో ఆగ్నేయ బెంగళూరులోని సబర్బ్ బెల్లందూర్‌లో ఈ ఘటన జరిగింది.

Also Read: హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం.. బంగారం విత్ డ్రా చేసుకోవచ్చు.. దేశంలోనే తొలిసారిగా..

ఆ దొంగలు బ్యాక్ సైడ్ ఓపెన్‌గానే ఉంచిన్ ట్రక్‌లో ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లుతున్నట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu