వ్యాక్సినేషన్ వేగవంతం: కొవాగ్జిన్ ఫార్ములా బదిలీకి కేంద్రం ఓకే..?

By Siva KodatiFirst Published May 13, 2021, 5:19 PM IST
Highlights

దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొవాగ్జిన్ ఫార్మూలాను మరికొన్ని కంపెనీలకు ఇచ్చే దిశగా యోచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. 

దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొవాగ్జిన్ ఫార్మూలాను మరికొన్ని కంపెనీలకు ఇచ్చే దిశగా యోచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. ఇదే విషయమై నిన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. కోవాగ్జిన్ ఫార్మూలాను మరిన్ని కంపెనీలకు ఇవ్వాలని జగన్ కోరారు. 

విదేశీ వ్యాక్సిన్ల దిగుమతికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన చేస్తామని వెల్లడించింది. ఫైజర్, మోడెర్నా సంస్థలు విదేశాంగ శాఖను సంప్రదించాయని కేంద్రం పేర్కొంది. అలాగే భారత్‌లో వ్యాక్సిన్  ఉత్పత్తి చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కూడా సిద్ధంగా వుందని వెల్లడించింది. 

Also Read:భారత్‌లోకి mRNA వ్యాక్సిన్.. అమెరికన్ సంస్థలతో ఒప్పందం దిశగా అడుగులు..?

కోవాగ్జిన్, కోవిషిల్డ్ వ్యాక్సీన్ ఫార్ములాను ఇప్పుడున్న సీరం ఇన్స్ స్టిట్యూట్‌ , భారత్ బయోటెక్ లకు తోడు మరికొన్ని కంపెనీలకు ఇస్తే ఉత్పత్తి వేగవంతం అవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. కొత్త కంపెనీలను ప్రోత్సాహం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని దేశ అవసరాల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు

click me!